హోమ్

Saturday, February 26, 2011

వి"చిత్రపతి"


చత్రపతి అను ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చాల కాలం నుంచి తనకు తన సహోద్యోకులకు జీతం పెరగక ఆవేదనకీ గురి అయ్యి తిరగబడి ఒక్క మనజర్ని నరికి వేయగానే అప్పల నాయుడు అనే కొత్త మేనేజర్ వచ్చాడు


చత్రపతి : ఎవడో ఒక్కడి  కింద  పనిచేస్తే  తప్ప  మాకు వేరే దారి  లేదన్నావ్  . ఇప్పుడు  వీడు  పోయాడు  . వీడి  చైర్లో  కి  నువ్వు  వస్తావా ???

మేనేజర్ : వద్దు… నీకేం కావాలి  ???? చెప్పు  ,,,,

చత్రపతి  : ఒక్క  హైకు …………… ఒక్క  హైకు 
ఇది  మా  కంపెనీ , మా  వాళ్ళు  పనిచేస్తున్న  కంపెనీ  .. ఇదే  కంపెనీ  లో  ఏళ్ళ  తరపడి  హైకు  కి  ఎడ్చం  , బోనస్  కి  ఎడ్చం  , ప్రమోషన్ కి  ఎడ్చం  అన్ సైటులకి  ఎడ్చం ..

కడుపు  మాడితే  Sodex ho లతో  తిని  , కన్నీళ్లు  తాగి  బతికం ... ఇప్పుడు  ఆ  కన్నీళ్లు  మండాయి , ఎవరినా  వస్తే  మాడిపోతారు  …….

మార్చ్  పోతే  సెప్టెంబర్  , సెప్టెంబర్  పోతే  మార్చ్  , అదికూడా  పోతే  నెక్స్ట్  మార్చ్  అని  హైకు  లేట్ చేస్తే …..!!!!!!

అప్పల  నాయుడు  … శాలరీ  కట్  చేసిన , కాబ్  కట్  చేసిన  .. బ్లాకు  మెయిల్  చేసిన  లేక  పోతే  HR తో  వచ్చిన  .. … కంపెనీ  లో  computer లు  ఎరుపు  రంగుతో  హీటెక్కుతాయి  … పూటకో రిజిగ్నేషన్  నీ  టేబుల్  మీద  ఉంటాయి ……....

అగ్నిశకల ………………

తన తోటి వారితో
ఈ  రోజు  నుంచి  మీ  అందరి  బతుకులు  మారాయి . PL లకి  సలుటే  లు , Manager లకి  జిందాబాద్  కొట్టే  బానిస  బతుకు  చచ్చింది ..
ఇక  నుంచి  మీకు  కళ్ళు  దిన్చుకోనేంది  కింద  keyboard చూడడానికి , కళ్ళకి  మొక్కటానికి  కాదు  ,, తల దించుకోవలసింది  Type చెయ్యడానికి  Top Management కి  కాదు

ఇక నుంచి  పని  మనది  , పెత్తనం  మనది  , ప్రాజెక్టులు  మనవి  ,, కంపెనీ  మనది  , computerlu మనవి  ..

ఈ  పోరాటం  బలికోరితే  మీ  అందరి  ముందు  నేనున్నా ..
మీరు  ప్రోగ్రామరైతే  నేను  లీడ్నవుతా  , మీరు లీడ్స్  అయితే  నేను  manger ని  అవుత  , మీరు  మేనేజర్  లు  అయితే  నేను  CEO ని  అవుతా  .
అది  కాకపోతే పని  ఇవ్వకుండా  శాలరీ  ఇచే  క్లైంట్ నవుతా

జనాల రిప్లై

నువ్వు  ఈ  కంపెనీకి  ఊరికే  రాలేదురా   ………. నువ్వు  శివాజీవి  కాదురా  . నీ  తోటి  వాళ్ళ  కోసం  వచ్చిన  వీర  విచిత్రపతి  వి  ………………… తియ్యర  Resume ………..

విచిత్రపతి  … విచిత్రపతి  … విచిత్రపతి  …

PS : ఎవడో ఈ మెయిల్ నాకు forward చేస్తే, నేను మళ్ళి నా ఫ్రెండ్స్ కి forward చేశాను. మర్నాడు మా మేనేజర్ నన్ను పీకేసాడు ఎందుకంటారు.

Friday, February 25, 2011

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదు

ఇండియాలో ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికుల రోజు అని అది మర్యాదస్తుల కుటుంబ ఆచార వ్యవహారాలకి విరుద్హం అని చాల మంది అనుకుంటారు కాని నిజంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు మాత్రమె కాదు.

అమెరికా లో చాల వింత పద్ధతి పాటిస్తారు, మన దైనందిన రోజు సహాయపడే వాళ్ళ అందరికి కృతజ్ఞతగా THANKS GIVING DAY ని సెలెబ్రేట్ చేసినట్టే మనం ప్రేమించే వారి అందరిని అనగా తల్లి, తండ్రి, అమ్మమ్మ - తాతయ్య, నానమ్మ - తాతయ్య, బాబాయిలు-పిన్నులు, అతమ్మలు-మామయ్యలు, ఇంకా మనల్ని ప్రేమించే ఇతర బందువర్గాన్ని, మనకు చదువు నేర్పిన గురువులకు మీ ప్రేమకు ధన్యవాదములు, నేను కూడా మీరు నన్ను ఎంతైతే ఇష్టపడుతున్నారో, ప్రేమిస్తునారో, నేను కూడా మీ పట్ల అదే కృతజ్ఞత, ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఏర్పరచిన ఒక ఆచారం. 

నిజంగా మనం ఎంతమంది మన తల్లిదండ్రులకి మాకు జన్మనిచ్చినందుకు, మమ్మల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసినందుకు ధన్యవాదాలు చెప్పి. మీరు అంటే కూడా మాకు అంతే ఇష్టం అని చెప్పాము, చెప్పిన కాస్త dramatic గా ఉండదా. అలాంటివారికి ఇది ఒక అవకాశం అనమాట.

ఇక్కడ ఇంకో సంఘటన చెప్పాలి, అమెరికన్స్ ఎవరు ఏ మంచి పని చేసిన ఖచిత్తంగా THANKS చెబ్తారు. మొన్న నేను కార్లో వెళ్తుంటే ఓక సిగ్నల్ మీద రోడ్డు మధ్యలో ఒక truck లోంచి ఒక డబ్బా పడిపోయింది. అది రోడ్డుకడ్డంగా పడిపోయింది. నేను కార్ ఆపి ఆ డబ్బా పక్కన పెట్టి వచ్చాను. నేను మళ్ళి కార్ తీసేవరకు అందరు హరన్ కొట్టకుండా ఉండడం కాకుండా నేను తిఇగి కార్ వద్దకు వస్తుంటే ఒకరిద్దరు GOOD JOB అని GESTURE చేసారు. అది వారి స్వభావం.

 అందుకే వాళ్ళు THANKS GIVING DAY మరియు VALENTINES DAY జరుపుకునేది. దాన్ని మన వాళ్ళు గబ్బు పాటించారు అదే వేరే విషయం. కాబట్టి ఈ సారి FEBRUARY 14TH కి మన వారందరికీ వారు అంటే మీకు  ఇష్టం అని తెలపడం మర్చిపోకండి. 

అందుకే అయ్యా మీకు నా పాదాభివందనాలు

మహానుభావులారా మీకు పాదాభివందనం...

ఇప్పుడే నవతరంగం లో వచ్చిన బాపు గారి మా సినిమాలు చదివాను. అక్కడే comment వేద్దాం అనుకోని కాస్త length ఎక్కువయింది అని ఇక్కడ చెప్పడం జరిగింది. క్షమించాలి. 

ఒక్కొక సినిమా వెనుక వారి శ్రద్ధ, కార్యదీక్షత, ఓర్పు, పనితనం, ఆనాటి జ్ఞాపకాలు ఇంకా మధురంగా ఉన్నాయ్యి అంటే వాటి వెనక ఉన్న కష్టం-ఇష్టం తెలిసాయి. సినిమా అంటే ఒక కళ అని వారి పూర్వికులు చెబ్తే నిరూపించిన మహానుభావులు. ఒక్క సినిమా మీద వారి కున్న పట్టు ఏంటో ఆ ఆర్టికల్ చదివితే తెలుస్తుంది. 

అందుకే మీకు నా పాదాభివందనాలు

చిన్న చిన్న జ్ఞాపకాలు, ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ కూడా గుర్తు ఉన్నాయి అంటే ఆ రోజులో ప్రతి సంఘటనని ఏంటో సున్నిశితంగా గమనించారో అర్థం అయ్యింది. ఆ మాత్రం జాగ్రతగా తీసేరు కాబట్టే వాళ్ళు బాపు-రమణలు అయ్యారు. వారి మీద వారు వేసుకునే వ్యంగోక్తులు, తెలుగు సినిమాని ఎవరికీ అందనత్త ఎత్తుకు తీసుకువెళ్ళిన వాళ్ళలో ఆ అహం ప్రవేశించలేదనటానికి  నిదర్సనం. ఎదిగిన చెట్టు ఒదిగే ఉంటుంది అనటానికి ఇంత కన్నా నిదర్సనం ఎం కావాలి.

అందుకే మీకు నా పాదాభివందనాలు

ఒక్కో టేక్నిషియన్ని ఇంత బాగా గుర్తు పెట్టుకున్నారు అంటే టెక్నిషియన్స్  పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని సూచిస్తుంది, పెద్ద పెద్ద నటినతులకు ఇచే గౌరవం , జూ|| ఆర్టిస్ట్ పట్ల కూడా చూపించేవారు అంటే వారి ఎంతటి సున్నిత హృదయులో. హిట్ ఐతే వారి తో పనిచేసిన వారి గోప్పతన్నాని మెచ్చుకొని, సినిమా పయిన కాని ఆ సినిమాకి పనిచేసిన వారి కష్టాన్ని తలచుకోవడం వారికే చెల్లింది. 

అందుకే మీకు నా పాదాభివందనాలు

ఓ జమీందారీ గ్రామంలో ఓ రైతుకి ఒకే ఆవుండేదిట. నీదగ్గర పాడి ఎంత అని అడిగితే దొరగారివీ నావీ కలిపి వందా అనేవాట్ట. ‘మేమూ అంటే 99 ఆవులూ బాపు-రమణ గారివి' మిగితా ఆ ఒక్కటి మా తెలుగు సినిమాలవి. అందుకే అయ్యా మీకు నా పాదాభివందనాలు. (ఇది బాపు గారి "మా సినిమాలు" లోని మొదటి, చివరి వాక్యాలు ) 


మీకోసం నవతరంగం లింక్ : http://navatarangam.com/2011/02/our-films-bapu-1/

Thursday, February 24, 2011

ప్రపంచంలో ఉన్న అన్ని చీమల బరువు ప్రపంచంలోని మనషుల బరువుకి సమానం

ప్రపంచంలో ఉన్న అన్ని చీమల బరువు ప్రపంచంలోని మనషుల బరువుకి సమానం , నమ్మరా, నేను నమ్మలా కానీ వాటికి మనకి ఉన్న నిస్పత్హి 1 : 10 లక్షలు, వాటికి కోపం వస్తే మన అందర్నీ కలిపి సముద్రంలో పడేయ గలవు అంట ఎందుకు అంటే వాటి బరువుకు రెట్టింపు బరువును మోయగలవు కాబట్టి.

కాబట్టి చీమే కదా అని చీప్ గా తీసుకున్నావో ......... అని అవి వార్నింగ్ ఇస్తాయి ఏమో.

రజని కాంత్ గారి ఫ్రాంక్ నెస్. అందుకే అయన అంత పెద్ద స్టార్ అయ్యారు


దేవుడు అలసిపోయాడు

నిజమే, దేవుడు అలసిపోయాడు. 

లేకపోతే ఎంటండి, ఎవరన్నాగంటకో పని చెబ్తేనే కోపం వస్తుంది మనకు, అలాంటిది నిమిషానికి కొన్ని కోట్ల మంది, కొన్ని వందల కోట్ల కోర్కెలు కోరితే, ఆఖరికి ఎవడన్నా విసిగిస్తే కూడా దేవుడా ఎందుకు నాకు ఈ torture ? అని అనటమే, మరి దేవుడికి విసుగు రాదా? రాకూడదా?

అందుకే RELAXATION కోసం మన రమణ గారిని పట్టుకెళ్ళారు, అయన అక్కడ నవ్వులు విర్మిజిమ్మితే ఆనందిద్దమని, దేవుడు గారు జాగ్రత్తన్డోయి, మా రమణ గారి మత్తు లో, గమత్తు లో పడి మమల్ని మర్చిపోయారు.

పాపం దేవుడన్నాక కుడా కాస్త కళాపో'స'ణ ఉండాలి మరి...

Wednesday, February 23, 2011

మా రవణ...

మా రవణ గురించి ఎంత చెప్పిన తక్కువే;  ఏవన్నీ చెప్పను, ఇప్పుడు మాటలు రావట్లేదు.

నాకు మొదటి సరి రమణ గారి గురించి తెల్సింది పెళ్లి పుస్తకం సినిమా తో,  అందులో dialogues నచ్చి మా నాన్నతో అన్నాను భలే ఉంటాయి బాపు గారి dialogues అని. అప్పుడు మా నాన్నారు చెప్పారు, బాపు వోడు డైలోగులు రాయరు, ఆయనెనుక రవణ అని ఒకడుంటాడు, అయన చేతి మహత్యం అని. GUESS I WAS AN INSTANT FAN 

అప్పటికే కాస్త సినిమా పిచ్చి ఉండటం, ఇంట్లో సినిమాలకి ప్రోత్సాహమిచ్చే కుటుంబం కావడం వల్ల అంతకు ముందు వచ్చిన సినిమాలు చూడటం మొదలి పెట్టు అయన శైలిని గమనించాను. Dialogues అంటే పలకటానికి కష్టంగా ఉండే చాంతాడు కంటే గుర్తు పెట్టుకోవడానికి వీలుగా సరళంగా ఉంటె బెటర్ అని. 

మనతో కోతి కొమచ్చి ఆడించి, మనల్ని ఉయలులూపింది మీ కందిరికి తెల్సు అనుకుంటా, ఈ మధ్య కాలం లో నేను కొన్నవి (కొన్నవి అని గమనిoచగలరు) రెండే పుస్తకాలు, ఒకటి రమణ గారి కోతి కొమచ్చి అంతకు ముందు వంశి గారి మా పసలపూడి కథలు.

అదృష్టవశాత్తు రాధాగోపాలం సినిమాకి వెళ్ళినప్పుడు బాపు, రమణ గార్లు పక్కనే కూర్చొని ఉండటం, నేను బాపు గార్ని గుర్తుపట్టి ఆశీర్వాదం తీసుకోవడం, దురదృష్టవశాత్తు పక్కనే ఉన్న రమణ గారిని గమనించక పోఅవడం, మళ్ళి వెళ్ళే లోపి INTERVAL అయ్యి సినిమా మొదలవట్టం; సినిమా అయ్యేలోపు వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం తో అయన ఆశీర్వాదం తీసుకునే ఛాన్స్ రాలేదు.

coincidence ఏమో మరేటో గాని మా ఇంటికి ఇవాలే రమణ గారి బాల రామాయణం వచ్చింది. 

నాకు అన్నింటి కన్నా ఆయనలో నచ్చింది అయన ఆత్మా విశ్వాసం, కోతి కొమచ్చి చదవండి ఎందుకో మీకే తెలుస్తుంది. అయన చాల కష్టాలు పడ్డారు కానీ ఆనాటి నుని నేటి వరకు ఆయన రచన లో పట్టుత్వం తగ్గలేదు. మరణం మనిషిని తీసుకెళ్లవచ్చు, అయన అందించిన మధుర ఫలాలని కాదు, అవి తెలుగు జాతి ఉన్నంత వరకు మధుర రసాలను అందిస్తూనే ఉంటాయి. రమణ గారి గురించి బాపు గారి గురించి చెప్పకపోవడం భావ్యం కాదు. రమణ గారు, మీరేం బాధ పడకండి, బాపు గార్ని మేము జగ్రతగ్గా చూసుకుంటాం, స్వర్గంలో హాస్యాన్ని పండించండి.

KSD అప్పలరాజు - ఎందుకు సర్, ఇలాంటి సినిమా తీసారు

JUST TELLING, THIS IS NOT A REVIEW, THIS IS ASK RAM GOPAL VARMA FEW QUESTIONS I HAVE

ఏమి జరుగుతోందో అర్థం కావట్లేదు. నా అభిమాన దర్శకుడు, ఒక శివ, క్షణ క్షణం లాంటి అత్యుత్తమ దర్శకుడు తీసిన సినిమా అంటే నమ్మబుద్ధి  కావట్లేదు, ఎందుకు ఇలా అని నిద్ర పట్టట్లేదు. వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేసే అవకాశం వస్తే ఇప్పుడే INDIA కి టికెట్ తీసుకొని వస్తాను అని చాల సార్లు అన్నాను నేను, ఇంకా అదే మాట కట్టుబడి ఉన్నాను 

కానీ ఎందుకో ఇప్పుడు భయంగా ఉంది. సినిమా బాలేదు అని కాదు, టేకింగ్ బాలేదని అంతకన్నా కాదు, రాము సునీల్ ద్వారా ఎం చెప్పించదాల్చుకున్నడో అదే జరిగింది. సునీల్ చివరికి ఎలా తల పట్టుకున్నాడో అలానే రాము పట్టుకున్నాడు. కాకపోతే సునీల్ కి రాము కి ఒకటే తేడా - రాము సినిమా మొదట్లో ఇది కామెడీ సినిమా కాదు అని చెప్పాడు, సునీల్ చెప్పాలా.

  • అసలు సినిమా మొదట్లోనే దారి తప్పింది. సినిమా నడుస్తూంటే ధియేటర్ లో పిల్లలు ఆడుకోవటం, ఎవరిదీ సర్ ఆ ఐడియా. మీరు ఎక్కడన్నా చూసారా.
  • ఇంత పెద్ద director అయిన మీరు ఎందుకు సర్ డూప్స్ ని పెట్టుకోవడం, నిన్న నిన్న వచ్చిన directors హాయిగా హీరోలని dates తీసుకొని వాడుకుంటుంటే, మీకు ఎందుకు సర్ ఆ కర్మ
  • Asst director లని creativity ఆధారంగా ఎన్నుకుంటారా, లేక రోడ్డు మీద నుండి పట్టుకోస్తారా? ఏ డైరెక్టర్ తన అసిస్టెంట్ డైరెక్టర్ అలా మాట్లాడితే ఉర్కుంటాడు. (రుద్రవీణ), మీ అసిస్టెంట్ డైరెక్టర్ అలా తిడితే మీరు ఊరుకుంటారా? (SHUT UP)  - ఆ characterisation ఏంటి సర్.
  •  అసలు గన్ను, రుద్రవీణ characters వల్ల సినిమాకి వచ్చిన లాభం ఏంటి?
  • database , దైవజ్ఞచారి లా characterization మీకు ఎబ్బెట్టు గా అనిపించలేదా...
  • ఆ background స్కోరు ఎవరిదీ సర్. కాస్త దణ్ణం పెడదామని 
  • ఎవరి పనులు వాళ్ళని చేసుకోనిక్క మనకు ఎందుకు వచ్చిన పాటలు రాసే పని సర్, అందరు ఇలా వల్ల పాటలు వల్లే రాసేసుకుంటే చంద్రబోసు, సిరివెన్నల లాంటి వాళ్ళు ఏమి కావాలి
  • IDLEBRAIN కానీండి, మరెవరైనా కానీయండి బావున్న సినిమాని బాలేదు అని రాసిన ఒక్క instance చూపించండి.  మగధీర కి, బొమ్మరిల్లుకు, వేదం కి NEGATIVE RATING ఇచ్చిన సైట్ ఒక్కటి చూపించండి.
గతంలో ఒక్క పెద్ద నిర్మాత దగ్గర నాకు రివ్యూ రాసే అవకాశం వచ్చింది, మగధీర సినిమా కి ఆయనకు సంబంధం లేదు, కాని నేను ఆయనకి రివ్యూ రాసేటప్పుడు ఓకే మాట వాడాను - ఈ సినిమాతో మిగిలిన్ దేశం అంత మన వైపు చూసి ఉల్లిక్కి పడతాయి, INDUSTRY రికార్డ్స్ తిరగ రాస్తుంది అని, తప్పని సరి పరిస్థుతులలో ఆ నిర్మాత ఆదేశం మేరకు మీ "అడవి" సినిమా ఒంటరిగా, ఒక్కడినే చూసే అవకాశం లభించింది. ఆ సినిమా టేకింగ్ కి ఎంత భయపడ్డానో, ఆ మాట చెప్తే తప్పా?
  • అసలు బాబు గారు, బాబు గారు అని బాబు గారిని అనడం ఎందుకు, ఆల్రెడీ చాల సినిమాల్లో వాడి వాడి ఎబ్బెట్టుగా తాయారు అయింది అన్న విషయం మీకు తెలిద?
  • రవితేజ గెస్ట్ ఎంట్రన్సు వల్ల లాభం? 
  • మీరు చెప్పిన చాల points ఇంతకు ముందు చాలా చాలా సార్లు చెప్పారు అనే విషయం అప్పుడప్పుడు వేరే వాళ్ల సినిమాలు చూస్తే తెలుస్తుంది.
******************************************************************
  • ఎందుకు సర్, ఇలాంటి సినిమా తీసారు, ఒక్కసారి ఈ సినిమా చూసి ఇంటికి వెళ్లి శివ చూడండి, VODKA కన్నా మీ శివ సినిమా ఎక్కువ kick ఇస్తుంది.
  • అలుపన్నది ఉందా అని "గాయం" లో  పాట విన్నాక, ఈ సాహిత్యం ఎంత బావుందో చెప్పండి. 
  • నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అని అనిపించిన మీలో ఆ కసి, పట్టుదల ఏమైంది సర్.
  • Tollywood లో మంచి హాస్య చిత్రాల పేర్లలో మీ మని, మని-మని ఉంటాయి తెలుసా.
  • background స్కోరు వల్ల సినిమా హిట్ అవుతుంది అని మేము GODFATHER చూసి తెల్సుకోలేదు, మీ శివ, క్షణ-క్షణం చూసి తెలుసుకున్నాం.
చెప్పాలి అంటే మిమ్మల్ని అభిమానించటానికి నా దగ్గర చాలా POINTS ఉన్నాయ్యి, నా అభిమాన దర్శకుడు ఎవరు అని అడిగితె నిద్రలోనయినా మీ పేరే చెబుతా (మా ఆవిడా నాలుగు పీకినా సరే) కాని కాస్త పంథా మార్చుకోండి సర్. మీ కోసం కాదు మాలాంటి అభిమానుల కోసం. 

PS : తిట్టల్సినది తిట్టి  నెయ్యి (BUTTER) రాసాడు అనుకోకండి, పెద్ద మాట ఇక్కడ వాడొచ్చో లేదో కాని - భగవంతున్ని తిట్టినా, మొక్కిన ఆ హక్కు ప్రియభక్తులకే - కాదంటారా.



Monday, February 14, 2011

ఫిబ్రవరి 14

ఫిబ్రవరి 14
అనుకున్నదంతా అయింది, ఇంటి నిండా బంధువులు, మెళ్ళో తాళిబొట్టు, దండలతో నేను రాజేష్. ఇప్పుడు వీళ్ళందరికీ ఎం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అసలు ఇవాళ ఇంట్లోంచి బయల్దేరుతున్నప్పుడే అనుకుంటున్నా, ఏదో జరుగుతుంది అని కాని ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. అందరు నవ్వడమే, అమ్మ తిట్లు భరించలేక మాకు పెళ్లి చేసిన "సదరు పెద్దమనిషి" ఇహనో ఇప్పుడో పారిపోవడానికి రెడీ గా ఉన్నాడు. రాజేష్ చూడు ఎలా చూస్తున్నాడో తనకేం సంబంధం లేనట్లు, వాళ్ళు బలవంతంగా తాళి కట్టిస్తున్నపుడు ఎం మాట్లాడలేదు మహానుభావుడు.

రాజేష్  పొద్దుట్నుంచి ఒక్కటే గొడవ, NECKLACE ROADకి వెళ్దాం అని, నేను సరే అన్నాను. అసలు నాకు రాజేష్  PROPOSE చేసింది కూడా ఇక్కడే, ౩ సం|| క్రితం. అప్పటి నుంచి ప్రతిసారి అక్కడే వెళ్ళడం అలవాటు. అదేంటో ఆ చెట్టు ఆ బెంచి మా కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉంటాయి. ఇవాళ కూడా అలానే కొద్దిసేపు కూర్చుందాం అని వెళ్ళాము, ఇంతలో ఎవరో ఒక గుంపు వేసుకొని వచ్చారు, ఆ గ్రూపుకి లీడర్ అనుకుంటా ఏంటి ప్రేమికులా అని అడిగాడు. రాజేష్ కాదు, నువ్వు ఎవ్వరు, నడువు ఇక్కడి నుంచి అని అన్నాడు, అంతే ఆ లీడర్ కి కోపం వచ్చేసింది, ఎంత చెబ్తున్నా వినకుండా, వీళ్ళ పక్కనే ఒక పురోహితుడు కుడా, ఏవో నాలుగు మంత్రాలు చదివాడు, ఒక పసుపు కొమ్ము రాజేష్ చేతికి ఇచి కట్టమన్నాడు, రాజేష్ ఏమి చెప్తున్నా వినిపించుకుంటేనా???

ఆ కార్యక్రమం కాగానే మా బండి పక్కనే ఉంది అన్నా కాని వినిపించుకోకుండా వాళ్ళ జీపులో ఎక్కించుకొని ఇంటి ముందు దింపారు.

ఇహ ఇంటి ముందు దిగగానే, ఇంటి ముందు ఉన్నా అమ్మలక్కలు ముక్కు మీద వేలు వేసుకొని చూస్తున్నారు, ఇదేం చోద్యం అని, చెల్లి పెళ్ళికి హాల్ బుక్ చేసుకొని రండి అని పంపిస్తే మీరు పెళ్లి చేసుకొని వచ్చారు ఏంటి అని అమ్మ ముందు నా మీద అరిచి తర్వాత ఆ "సదరు పెద్దమనిషి" తిట్టింది. సూత్రాలు లేకుండా బయటకి వెళ్ళినందుకు మా అత్తగారు, రాజేష్ వాళ్ళ అమ్మగారు నవ్వుకుంటే, ఏమి తెలియకుండా బోసి నవ్వులు చిందిస్తోంది, ఆవిడ ఒళ్లో కూర్చున్న నా కూతురు.

 ఆ కార్యక్రమం అయింది కదా తర్వాత కార్యక్రమం సంగతి చూడమంటావా అని నా కోతి చెల్లెళ్ళు అన్నప్పుడు మాత్రం నిజంగానే సిగ్గు వేసింది అంటే నమ్మండి. ప్రేమించిన మూడు నెలలకే పెళ్లి చేసుకొన్న మాకు ఈ పెళ్లి VALENTINEs DAY కానుకు అన్నమాట.

Thursday, February 10, 2011

ఆమ్లెట్ రాంబాబు

ఉత్తి అమాయకుడు మా రాంబాబు. వాడితో నా మొదటి జ్ఞాపకం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఉమా medicals  దగ్గర, "ఇక్కడ మందులు చాలా బాగా ఉంటాయి తెల్సా" అన్న మాటతో,. అమాయకత్వంతో మమ్మల్ని ఏదో ఓటి అనడం, బుక్ అయిపోవడం వాడి నిత్యకృత్యం. బాగా గుర్తు ఉన్నవి మాత్రం -

ఒక రోజు మెస్ లో భోజనం చేసి ఇంటికి వస్తుంటే రాంబాబు ఎదురు అయ్యాడు, అదే క్షణంలో ఎందుకో ఆమ్లెట్ తినాలి అని నాకు కోరిక కలగటం యాదృచ్చికం ఐతే మనం వేసుకొని తినాలి అని మా ఈశ్వర్ గాడికి అనిపించడం మాత్రం విచిత్రం. బ్రహ్మచారి వెధవలం నేను మొదట్లో కొన్న పొయ్యి అందులో అడుగులో మిగిలిన నాలు keresone చుక్కలు, కాని అప్పుడు తోక్కాడో ఎప్పుడో తోక్కడో కాని పాపం మా రాంబాబు, ఈశ్వర్ని ఎందుకో కేలికాడు, అంతే వాడికి తెలీకుండా వాడి సైకిల్ keys జేబులో వేసుకొని వచ్చింది కాక మళ్ళి వాడి దగ్గరే  ఆమ్లెట్కి అన్ని సమకురుస్తానని మాట తీసుకున్నాం. పొద్దునే రాంబాబు ఇంట్లో చెప్పకుండా ఒక అట్లకాడ, పెనం వేసుకొని ప్రత్యక్షం. ఇక కోరిక నాది కాబట్టి "గుడ్లు" నా భాద్యత - మధ్యానం భోజనానికి వెళ్ళినప్పుడు మెస్ నుంచి గుడ్లు తెచ్చాను, మనకు అక్కడ అడ్డు-అదుపు ఉండదు, బిల్లు ఉండదు. తెలివిగా కాస్త ఉప్పు కుడా తెచ్చాను (BORN GENIUS కదా), కాని ప్రాబ్లం నూనేతోనే, బాచిలర్స్ రూములో కొబ్బరి నూనేకి దిక్కు లేదు ఇంకా వంట నూనే ఎక్కడిది. మళ్ళి మా రాంబాబు కి 2 రూ లిచ్చి నూనే తెమన్నిపంపించాము, ఎం చేసాడో ఎలా చేసాడో కాని అర గ్లాస్ నూనే తెచ్చాడు. ఏమి ఉన్నలేక పోయిన అగ్గిపెట్ట రెడీగా ఉంటుంది కాబట్టి అలా ఆమ్లెట్ వేసుకున్నాం, ఇంతలో ఇంకో "గద్ద" వచ్చి ఆమ్లెట్ ఎగరేసుకుపోయింది అనుకోండి కాని వేరే కథ. అలా రాంబాబు  దయ వల్ల ఆమ్లెట్ "వేసుకున్నాం" .

కొన్ని రోజులకి నా అస్తమా మందులు అన్ని పారేస్తూ మా ఈశ్వర్ గాడు వాటిని ఒక గ్లాస్ లో వేసి అందులో వాడికి డాక్టర్ ఇచ్చిన DIGENE TONIC, ENO ANTACID వెయ్యగానే పొగలు వచ్చాయి, అది చుసిన రాంబాబు గాడు నువ్వు తాగారా దెబ్బకి పోతావు అనడం, వాడు రాంబాబు వెంటపడడం - చచ్చాము నవ్వుకోలేక. (ఆ పొగలు సాయంత్రం దాకా వస్తూనే ofcourse అందులో మేము నిమ్మకాయలు, ఉప్పు, ఆయిల్ అలా వేస్తూనే ఉన్నాం)

తలచుకుంటే నవ్వు వస్తున్నా పాపం ఆ రోజు మేము చేసిన పనికి వాడు ఎంత బాధ/ఇబ్బంది పడ్డాడో తలచుకుంటే బాధగ ఉంది. తర్వాత తర్వాత చాల కష్టాలు పడ్డాడు అని విన్నా, but never got chance to meet him, ఎక్కడ ఉన్నా, MAY GOD BLESS HIM.

Tuesday, January 25, 2011

EVV జంధ్యాల

భక్తుల కష్టాలు తీర్చి తీర్చి దేవుడికి విసుగు వచ్చింది. అలాంటి ఒక రోజు "శ్రీ వారికి ప్రేమలేఖ" చూసి సుత్తి వీరభద్ర రావు కి వీర అభిమాని అయ్యాడు. ఆ తర్వాత ఆయనవే కొన్ని సినిమాలు చూసి ఇలాంటి వాడు నా పక్కనుంటే నా కష్టాలు సగం తీరుతాయి కదా అని 30 June 1988 నాడు ఆయనని తీసుకెళ్ళాడు.

అసలు నాదేమి ఉంది ఇది మా హాస్యబ్రహ్మ జంధ్యాల వారి పనితనం అని మన సుత్తి వారు అనగానే తన పదవికి ఎసరు పేట్టేత్తున్నాడనో లేక అయన పనితనం నచ్చిందో కాని ఆయనని లాక్కు వెళ్ళిపోయాడు.

అప్పటినుంచి ఏదో EVV గారు అలా అప్పుడప్పుడు మచ్చుకొక్కటి "ఎవడి గోల వాడిదే", "బెండు అప్పారావు RMP" అంటుంటే చూసి ఆనందపడిపోయం. బహుశా మన పాపాలు తట్టుకోలేక ఆ పైనఉన్నవాడికి శిరోభారం  ఎక్కువ అయినదో లేక వీరి బహు గొప్ప హాస్యం నచ్చినదో ఇప్పుడు అయనని కూడా తీసుకెళ్ళిపోయాడు.

EVV గారు సుదీర్ఘకాలం జంధ్యాల గారి వద్ద హాస్యానికి తన బాష్యం కనిపెట్టి మనకి కితకితలు పెట్టారు EVV. అప్పుల అప్పారావు, ఆ వక్కటి అడక్కు, హలో బ్రదర్ లాంటి సినిమాలు ఇప్పటికి మనల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి. కొన్ని సీరియస్ సినిమాలు చేసి ఆడవాళ్ళకు  దగ్గర అయినా కాని వాటిలో కూడా తన హాస్యాన్ని జొప్పించి మార్కులు కొట్టేయడం కూడా ఆయనకే చెల్లింది. చూడటానికి అన్ని ఒకేలా అనిపించినా ప్రతి సినిమాని ENJOY  చేసాము, చివరగా చేసిన కట్టి కాంతారావుతో సహా. PAISA VASOOL MAHARAJ

మొత్తానికి సున్నినతమైన కామెడి కి పెద్ద పీట వేసే వాళ్ళంతా వెళ్ళిపోయారు. మంచి హాస్య చిత్రాలకు EVV గారితో శుభం కార్డు పడింది అని నా ఫీలింగ్.

Jai Ho

AR Rahman nominated for another Oscar for his ORIGINAL MUSIC for Danny Boyle's 127 Hours. This is based on a true story of A mountain climber, Aron Ralston, who is trapped under a boulder while canyoneering alone near Moab, Utah and resorts to desperate measures in order to survive.

Danny Boyle and AR Rahman won couple of Oscars (8) for their earlier film, So does their magic work again. His work is competing with 'How to Train Your Dragon' by John Powell, 'Inception' by Hans Zimmer and 'The King's Speech' by Alexandre Desplat.

So Wish Rahman sir JAI HO and keep your fingers crossed till Feb. 27, 2011

Friday, January 14, 2011

షికాగో ప్రయాణం

మొత్తానికి "ఛి"కాగో వచ్చాము. అసలు బయల్దేరినప్పటి నుంచి నన్ను ఒక అనుమానం పీడిస్తోంది. ఇది షికాగోనా ఛికాగోనా. ఇంగ్లీష్ వారు దీని షికాగో అంటారు అంటా కానీ అసలు ఇంగ్లీష్ లో chi అని వ్రాస్తే ఛి కదా మరి ఇది షి ఎలా అయింది. నా ఐడియా ప్రకారం మన వాళ్ళు ఛి ఛి అంటుంటే ఇబ్బంది పడి మార్చుకున్నారేమో.  అసలు ఇంగ్లీష్ మాటలు ఇలా ఎందుకు ఉంటాయి అనేది నా మొదటి నుంచి అర్థం కాదు. మొన్నటికి మొన్న ఒక మనిషి పేరు తప్పు పలికాను, ఎం ఫీల్ అయ్యాడో ఏమో. నా పేరు ని సరిగ్గా పలికేవారు లేరు అనుకోండి. మీకో విచిత్రం చెప్పనా - ఇక్కడి వారు మన పేరు ఎలా పలకాలో తెల్సుకొని ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ 2-3 years నుంచి ఉంటున్న మన so called NRI లు మాత్రం మన పేరు కావాలని ఉచ్చరించే తీరు ఎంత విసిగిస్తుందో. సర్లే వదిలేయండి. 

మొత్తానికి షికాగో వచ్చాము డ్రైవ్ చేసుకుంటూ. న్యూ జెర్సీ నుంచి షికాగో 15  గంటల దూరం (830 miles - 1350 kms)అందునా మంచు, ఎలా అబ్బ అనుకున్నాం కానీ పర్లేదు. బానే ఉన్నాయి రోడ్లు. మొన్న నా స్నేహితుడు అన్నాడు ఇది ఇండియా కాదు అలసిపోవడానికి అన్నాడు. లవంగం గారు మీరు ఉర్కోండి రోడ్ ఎక్కడైనా ఒక్కటే ౧౫ గంటలు ఎలా డ్రైవ్ చెయ్యాలి అన్నాను కానీ నిన్న తెల్సింది. హైవె ఎక్కాక అసలు ఇబ్బంది లేదు. భలే ఉన్నాయి చుట్టూ కొండలు, ఇండియా లో ఐతే ఆపి ఫొటోస్ తీసుకోవడం అది చేసేవాళ్ళం కానీ ఇక్కడ cops  అదేనండి పోలీసులు పట్టుకుంటారు అని ఉరకున్నాం.

షికాగో కి న్యూ జెర్సీ కి చాలా తేడ ఉంది అని మొదటి చూపులో తెల్సింది, అవి ఏంటి ఎలా అనేది రేపటి టపా లో...

Tuesday, January 11, 2011

Triple suns over China

Later this week there was an illusion created by SUN showing 3 SUN's
The illusion, deemed a legitimate astronomical phenomenon, is created by the sun being shadowed by two smaller twins and making an image of three suns. The effect is known by experts as the 'phantom sun' and unofficially called an 'ice halo'. It generally appears at this time of year when ice crystals create high clouds.
Fortunately, for astronomers and citizens of Changchun alike, the clouds have formed perfectly in order to produce reflected sunlight and the curious 'triple sun'. It also produces an arched rainbow-effect that circles the sun and two surrounding smaller suns. These are both one tenth of the size of the sun itself.
sounds strange right...thats what is nature, anything can happen...any time

I LOVE VIJAYAWADA. Welcome back to my Blog


చాలా రోజులనుంచి మా ఆవిడ నా బ్లాగ్ స్టార్ట్ చెయ్యమని అడుగుతుంటే  ఏ టాపిక్ ఐతే బావుటుంది అని ఆలోచిస్తున్నా. అనుకోకుండా  రాత్రి ఒక మంచి ఐడియా తట్టింది. నన్ను కన్న నేల - నేను ఉన్న ఈ గడ్డ, ఈ రెంటి గురించి రాస్తే ఎలా ఉంటుంది అని.

చాలా మంది NEWYORK  ని ముంబై తో పోలుస్తారు కాని Newyork  కి మన బెజవాడ కి చాలా పోలికలు ఉన్నాయి, ఎలా అంటారా - చూడండి.

  • Newyork లానే విజయవాడ కూడా బిజినెస్ capital 
  • Hudson నది Newyork అందాన్ని తెస్తే మన కృష్ణమ్మా హొయలు మనకు కనువిందు చేస్తాయి.
  • వారి స్వాతంత్ర్యానికి గుర్తుగా FRANCE వారు అమెరికా వారికి ఇచ్చిన STATUE OF LIBERTY ఇక్కడ సొగసులు పొతే, మనల్ని పాలించినందుకు గుర్తుగా కాటన్ దొర వారు నిర్మించిన PRAKASAM BARRAGE  ఠీవిగా నిల్చుంటుంది. 
  • సినిమాలు నిర్మించేది హాలీవుడ్ లోనే అయినా వాటి  బిజినెస్ అంతా  Newyork లోనే జరుగుతుంది. అలానే హైదరాబాద్ లోనే కాక ప్రపంచమంతా నిర్మించే  తెలుగు సినిమాల బిజినెస్ విజయవాడలోనే జరుగుతుంది కాదంటారా?
  • అమెరికాలోని capital పట్టణం పేరు చెప్పు అనగానే  Newyork అంటారు చాలామంది. అలానే విజయవాడ కూడా, కాని అది మా జిల్లా సెంటర్ కాదు.
  •  Newyork పట్టణం ఎప్పుడు గలగలా పారే నదిలా ఉంటుంది, విజయవాడ కుడా.
  •  Newyork lincoln tunnel & hudson tunnel ప్రతిభ అబ్బురపరిస్తే మన చిట్టినగర్ సొరంగం కూడా నేనేమి తక్కువ తినలేదు సుమీ అంటుంది. చాలాకాలం అసలు కొండని ఎందుకు తవ్వారు అని నేను ఆలోచిస్తూ ఉండిపోయ. మరో విషయం విజయవాడ లో ఆ సొరంగం ఎప్పుడు కట్టారో మీకు తెలుసా. నాకు తెలిదు, వీలైతే కనుకొన్ని చెప్పండే.
  • NEWYORK US లో మూడో పెద్ద state ఐతే విజయవాడ AP లో మూడో పెద్ద పట్టణం.
  • ఎక్కడెక్కడి వాళ్లనో NEWYORK నగరం ఆదుకొని కడుపులో దాచుకుంటే మన దుర్గమ్మ తల్లి మనందర్నీ కాపాడి చల్లగా చూస్తుంది. 
  •  HUDSON నది మధ్యలో ELLIS ISLAND మంచి tourist స్పాట్ ఐతే మనకు Bhavani Island ఉంది కదా.
ఇన్ని పోలికలు ఉన్నాయి కాబట్టి NEWYORK  నగరాన్ని మన విజయవాడతో పోల్చడం తప్పులేదు. ఏమంటారు. NEWYORK లో ఎంత తిరిగినా, చూడాల్సింది ఇంకా ఏదో మిగిలే ఉంటుంది అంటా, అలానే విజయవాడ లో ఎన్ని రోజులు ఉన్నాకలవాల్సిన వాళ్ళు ఇంకా ఉంటూనే ఉంటారు. 

I LOVE VIJAYAWADA. 

Welcome back to my Blog

Monday, June 28, 2010

EMOTIONAL QUOTES

A Banner cum Sign Board In front of an IT company.. Drive Slowly, Don’t kill our Employee.........

Leave them to us

$$$$$$$$$$$$$$

An interesting line written at the back of a Biker's T Shirt:
" If you are able to see this, Please tell me that my galfriend has fallen off"

$$$$$$$$$$$$$$

Most Relationships fail not because of the absence of love..

Love is always present..

Its just that,

One loves too much,

and

The other loves too many,

$$$$$$$$$$$$$$

Employee: Boss, Now I have got married..! Please increase my salary..!

BOSS: Factory is not responsible for accidents occuring outside the company..!

$$$$$$$$$$$$$$

Philosophy of life

At the begining of married life, every gal treats her husband as GOD,

Later on somehow the alphabets get reversed..!

$$$$$$$$$$$$$$

What is Fear?

Fear is the Deep, Wrenching feeling in your stomach When pages of your book still smell new and Just few hours left for your exams..!


$$$$$$$$$$$$$$

After reading the form filled by an applicant..

The employer said: " WE do have an opening for you..!

Applicant: What is it?

Interviewer: Its called the "door..!"

A sad love story

A sad love story of an Engineering student..........

A guy was deeply in love with his classmate. One day he proposed her by saying that he loved her a lot.... But she was angry and refused and threatened him that she'd complain to the Principal if he ever bothers her again.

One day the girl borrowed a text book from that boy and wrote a message "I love you too, I'm sorry to hurt you the other day. if u've forgiven me, please come and talk to me and never leave me." in that book.

But the guy never talked to her.

4 yrs went away and nothing has happened..

.

.

.
Moral of the story:

Engineering boys never open their books!!!!!!!!!!!!!!

Tuesday, July 28, 2009

If Vijay Mallya Takes LPG Distribution............????????????


JUST FOR FUN

timely song

R. Narayana Murthy's song in next movie and its name is "Vykunta Paali".

which is about s/w and in that movie he will be playing IT professional and who will lose his job because of recession.

Emunnadakko ooo emunnadakkaaa.

Potta perigipoi..juttu ralipoi.vunna paruvu poi..

ee industry lo nakinka emunnadi akko.. emunnadi akko emunnadi akka..

B.Tech chesi naaka (saami)

Hyderabad cherukunnaa(saami)

Experience adugutunteeeee aa aaaa aaaav

Experience adugunte, enta kaavali ante anta petti, job kottina, join ayyina banchaaaaaaan

(Emunnadi akko..)

Training lu ivvaka paye (saami)

Client interaction annadu (saami)

Communication baledu ante a aaa aaaa

Communication baledu ante, kumili kumili edichina, hindu paper veyinchinaa banchaaaaaan

(Emunnadi akko..)

Project ichundu vaadu(saami)

Payslip kuda vachindi(saami)

Payslip chupinchiiii. a a a a a a aaaaaaaaaaaa

Payslip chupinchina, credit card teesukunna, avasaram lenivi anni konna appula palu ainaaa banchhaann.

(Emunnadi akko..)

Project aipoindiii(saami)

Kottadi vastadi annadu (saami)

Bench lo pettundu aaaaa a aa aaaaaaa

Bench lo pettinaaka subject marichipoina, o roju na HR pilusundu poi kalisina banchaann..

(Emunnadi akko..)

Boom taggindi annadu (saami)

Cost cutting annadu (saami)..

Benchlo vunna ani cheppiii aaaaaa a a a a aaaaa

Bench lo vunna ani cheppi bayatiki tosundu kompa kulchundu banchaaannn.

(Emunnadi akko..)

IPL EXAMS

Cricket has reached exciting levels with IPL, so we suggest infusing the
same thing into exams ...

Some suggestions:- Last one is the best.....!!!!!

1. Reduce exam duration to 1 hr and marks to 50.

2. Introduce strategic break after 30 minutes.

3. 1st 15 minutes power play that is no invigilator in the exam hall.
(Everyone will love this...!)

4. Introduce fair play awards.

5. If any wrong question is asked you can give your own answer for the next
question .......FREE HIT........ !!!!!!!!!



.

.



The last and the best.

.

.

6. Cheer girls to cheer for every correct answer written....!!!