చాలా రోజులనుంచి మా ఆవిడ నా బ్లాగ్ స్టార్ట్ చెయ్యమని అడుగుతుంటే ఏ టాపిక్ ఐతే బావుటుంది అని ఆలోచిస్తున్నా. అనుకోకుండా రాత్రి ఒక మంచి ఐడియా తట్టింది. నన్ను కన్న నేల - నేను ఉన్న ఈ గడ్డ, ఈ రెంటి గురించి రాస్తే ఎలా ఉంటుంది అని.
చాలా మంది NEWYORK ని ముంబై తో పోలుస్తారు కాని Newyork కి మన బెజవాడ కి చాలా పోలికలు ఉన్నాయి, ఎలా అంటారా - చూడండి.
- Newyork లానే విజయవాడ కూడా బిజినెస్ capital
- Hudson నది Newyork అందాన్ని తెస్తే మన కృష్ణమ్మా హొయలు మనకు కనువిందు చేస్తాయి.
- వారి స్వాతంత్ర్యానికి గుర్తుగా FRANCE వారు అమెరికా వారికి ఇచ్చిన STATUE OF LIBERTY ఇక్కడ సొగసులు పొతే, మనల్ని పాలించినందుకు గుర్తుగా కాటన్ దొర వారు నిర్మించిన PRAKASAM BARRAGE ఠీవిగా నిల్చుంటుంది.
- సినిమాలు నిర్మించేది హాలీవుడ్ లోనే అయినా వాటి బిజినెస్ అంతా Newyork లోనే జరుగుతుంది. అలానే హైదరాబాద్ లోనే కాక ప్రపంచమంతా నిర్మించే తెలుగు సినిమాల బిజినెస్ విజయవాడలోనే జరుగుతుంది కాదంటారా?
- అమెరికాలోని capital పట్టణం పేరు చెప్పు అనగానే Newyork అంటారు చాలామంది. అలానే విజయవాడ కూడా, కాని అది మా జిల్లా సెంటర్ కాదు.
- Newyork పట్టణం ఎప్పుడు గలగలా పారే నదిలా ఉంటుంది, విజయవాడ కుడా.
- Newyork lincoln tunnel & hudson tunnel ప్రతిభ అబ్బురపరిస్తే మన చిట్టినగర్ సొరంగం కూడా నేనేమి తక్కువ తినలేదు సుమీ అంటుంది. చాలాకాలం అసలు కొండని ఎందుకు తవ్వారు అని నేను ఆలోచిస్తూ ఉండిపోయ. మరో విషయం విజయవాడ లో ఆ సొరంగం ఎప్పుడు కట్టారో మీకు తెలుసా. నాకు తెలిదు, వీలైతే కనుకొన్ని చెప్పండే.
- NEWYORK US లో మూడో పెద్ద state ఐతే విజయవాడ AP లో మూడో పెద్ద పట్టణం.
- ఎక్కడెక్కడి వాళ్లనో NEWYORK నగరం ఆదుకొని కడుపులో దాచుకుంటే మన దుర్గమ్మ తల్లి మనందర్నీ కాపాడి చల్లగా చూస్తుంది.
- HUDSON నది మధ్యలో ELLIS ISLAND మంచి tourist స్పాట్ ఐతే మనకు Bhavani Island ఉంది కదా.
ఇన్ని పోలికలు ఉన్నాయి కాబట్టి NEWYORK నగరాన్ని మన విజయవాడతో పోల్చడం తప్పులేదు. ఏమంటారు. NEWYORK లో ఎంత తిరిగినా, చూడాల్సింది ఇంకా ఏదో మిగిలే ఉంటుంది అంటా, అలానే విజయవాడ లో ఎన్ని రోజులు ఉన్నాకలవాల్సిన వాళ్ళు ఇంకా ఉంటూనే ఉంటారు.
I LOVE VIJAYAWADA.
Welcome back to my Blog
No comments:
Post a Comment