నేను పుట్టింది ఆంధ్రలోనే కాని, నాకు ఉహ తెల్సింది తెలంగాణా లో
నేను పాకింది తెలంగాణలో, నేను నడిచింది తెలంగాణలో,
నేను విన్న మొదటి మాట తెలంగాణలో, నేను తిన్న మొదటి ముద్దా తెలంగాణలో.
నా అన్నప్రాసన తెలంగాణలో, నా అక్షరాభ్యాసం తెలంగాణలో.
నేను నవ్వింది ఏడ్చింది తెలంగాణలో,
నా హితులు నా స్నేహితులు తెలంగాణలో.
నా గురువులు మార్గదర్శకులు తెలంగాణలో,
నా నేర్చుకున్న సంస్కృతీ, సంప్రదాయాలు తెలంగాణలో
ఇక్కడి వారి కష్టాలు, నష్టాలు తెల్సు
వారి వేదన, ఆవేదన తెల్సు
నిష్కల్మషమైన వారి ప్రేమ తెల్సు,
ముప్పై ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న వారి అభిమానం తెల్సు.
ఈ ప్రేమ లో, అభిమానంలో ఏనాడు ఇట్లాంటి కుతంత్రాలు లేవు. ఎవరు కూడా నేటికి ఈ విధ్వంస సంస్కృతిని ప్రోత్సహించట్లేదు.
నాకు తెల్సిన తెలంగాణా వారు ఏనాడు ఇలాంటి పనులు చెయ్యరు, ఇది తెలంగాణా వారి పని కాదు. కాదు కాకూడదు.
దీని ఉద్దేశ్యం ఈ పని ఆంధ్ర వారు చేసారు అని కాదు; తెలంగాణా సంస్కృతి మర్చిపోయి ఉన్మాదమే ఉద్యమం అనుకుంటున్న వారు.
వీరు తెలంగాణా కోరే వాళ్ళు కాదు, తెలంగాణ ద్రోహులు
No comments:
Post a Comment