ఉత్తి అమాయకుడు మా రాంబాబు. వాడితో నా మొదటి జ్ఞాపకం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఉమా medicals దగ్గర, "ఇక్కడ మందులు చాలా బాగా ఉంటాయి తెల్సా" అన్న మాటతో,. అమాయకత్వంతో మమ్మల్ని ఏదో ఓటి అనడం, బుక్ అయిపోవడం వాడి నిత్యకృత్యం. బాగా గుర్తు ఉన్నవి మాత్రం -
ఒక రోజు మెస్ లో భోజనం చేసి ఇంటికి వస్తుంటే రాంబాబు ఎదురు అయ్యాడు, అదే క్షణంలో ఎందుకో ఆమ్లెట్ తినాలి అని నాకు కోరిక కలగటం యాదృచ్చికం ఐతే మనం వేసుకొని తినాలి అని మా ఈశ్వర్ గాడికి అనిపించడం మాత్రం విచిత్రం. బ్రహ్మచారి వెధవలం నేను మొదట్లో కొన్న పొయ్యి అందులో అడుగులో మిగిలిన నాలు keresone చుక్కలు, కాని అప్పుడు తోక్కాడో ఎప్పుడో తోక్కడో కాని పాపం మా రాంబాబు, ఈశ్వర్ని ఎందుకో కేలికాడు, అంతే వాడికి తెలీకుండా వాడి సైకిల్ keys జేబులో వేసుకొని వచ్చింది కాక మళ్ళి వాడి దగ్గరే ఆమ్లెట్కి అన్ని సమకురుస్తానని మాట తీసుకున్నాం. పొద్దునే రాంబాబు ఇంట్లో చెప్పకుండా ఒక అట్లకాడ, పెనం వేసుకొని ప్రత్యక్షం. ఇక కోరిక నాది కాబట్టి "గుడ్లు" నా భాద్యత - మధ్యానం భోజనానికి వెళ్ళినప్పుడు మెస్ నుంచి గుడ్లు తెచ్చాను, మనకు అక్కడ అడ్డు-అదుపు ఉండదు, బిల్లు ఉండదు. తెలివిగా కాస్త ఉప్పు కుడా తెచ్చాను (BORN GENIUS కదా), కాని ప్రాబ్లం నూనేతోనే, బాచిలర్స్ రూములో కొబ్బరి నూనేకి దిక్కు లేదు ఇంకా వంట నూనే ఎక్కడిది. మళ్ళి మా రాంబాబు కి 2 రూ లిచ్చి నూనే తెమన్నిపంపించాము, ఎం చేసాడో ఎలా చేసాడో కాని అర గ్లాస్ నూనే తెచ్చాడు. ఏమి ఉన్నలేక పోయిన అగ్గిపెట్ట రెడీగా ఉంటుంది కాబట్టి అలా ఆమ్లెట్ వేసుకున్నాం, ఇంతలో ఇంకో "గద్ద" వచ్చి ఆమ్లెట్ ఎగరేసుకుపోయింది అనుకోండి కాని వేరే కథ. అలా రాంబాబు దయ వల్ల ఆమ్లెట్ "వేసుకున్నాం" .
కొన్ని రోజులకి నా అస్తమా మందులు అన్ని పారేస్తూ మా ఈశ్వర్ గాడు వాటిని ఒక గ్లాస్ లో వేసి అందులో వాడికి డాక్టర్ ఇచ్చిన DIGENE TONIC, ENO ANTACID వెయ్యగానే పొగలు వచ్చాయి, అది చుసిన రాంబాబు గాడు నువ్వు తాగారా దెబ్బకి పోతావు అనడం, వాడు రాంబాబు వెంటపడడం - చచ్చాము నవ్వుకోలేక. (ఆ పొగలు సాయంత్రం దాకా వస్తూనే ofcourse అందులో మేము నిమ్మకాయలు, ఉప్పు, ఆయిల్ అలా వేస్తూనే ఉన్నాం)
తలచుకుంటే నవ్వు వస్తున్నా పాపం ఆ రోజు మేము చేసిన పనికి వాడు ఎంత బాధ/ఇబ్బంది పడ్డాడో తలచుకుంటే బాధగ ఉంది. తర్వాత తర్వాత చాల కష్టాలు పడ్డాడు అని విన్నా, but never got chance to meet him, ఎక్కడ ఉన్నా, MAY GOD BLESS HIM.
No comments:
Post a Comment