హోమ్

Wednesday, February 23, 2011

మా రవణ...

మా రవణ గురించి ఎంత చెప్పిన తక్కువే;  ఏవన్నీ చెప్పను, ఇప్పుడు మాటలు రావట్లేదు.

నాకు మొదటి సరి రమణ గారి గురించి తెల్సింది పెళ్లి పుస్తకం సినిమా తో,  అందులో dialogues నచ్చి మా నాన్నతో అన్నాను భలే ఉంటాయి బాపు గారి dialogues అని. అప్పుడు మా నాన్నారు చెప్పారు, బాపు వోడు డైలోగులు రాయరు, ఆయనెనుక రవణ అని ఒకడుంటాడు, అయన చేతి మహత్యం అని. GUESS I WAS AN INSTANT FAN 

అప్పటికే కాస్త సినిమా పిచ్చి ఉండటం, ఇంట్లో సినిమాలకి ప్రోత్సాహమిచ్చే కుటుంబం కావడం వల్ల అంతకు ముందు వచ్చిన సినిమాలు చూడటం మొదలి పెట్టు అయన శైలిని గమనించాను. Dialogues అంటే పలకటానికి కష్టంగా ఉండే చాంతాడు కంటే గుర్తు పెట్టుకోవడానికి వీలుగా సరళంగా ఉంటె బెటర్ అని. 

మనతో కోతి కొమచ్చి ఆడించి, మనల్ని ఉయలులూపింది మీ కందిరికి తెల్సు అనుకుంటా, ఈ మధ్య కాలం లో నేను కొన్నవి (కొన్నవి అని గమనిoచగలరు) రెండే పుస్తకాలు, ఒకటి రమణ గారి కోతి కొమచ్చి అంతకు ముందు వంశి గారి మా పసలపూడి కథలు.

అదృష్టవశాత్తు రాధాగోపాలం సినిమాకి వెళ్ళినప్పుడు బాపు, రమణ గార్లు పక్కనే కూర్చొని ఉండటం, నేను బాపు గార్ని గుర్తుపట్టి ఆశీర్వాదం తీసుకోవడం, దురదృష్టవశాత్తు పక్కనే ఉన్న రమణ గారిని గమనించక పోఅవడం, మళ్ళి వెళ్ళే లోపి INTERVAL అయ్యి సినిమా మొదలవట్టం; సినిమా అయ్యేలోపు వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం తో అయన ఆశీర్వాదం తీసుకునే ఛాన్స్ రాలేదు.

coincidence ఏమో మరేటో గాని మా ఇంటికి ఇవాలే రమణ గారి బాల రామాయణం వచ్చింది. 

నాకు అన్నింటి కన్నా ఆయనలో నచ్చింది అయన ఆత్మా విశ్వాసం, కోతి కొమచ్చి చదవండి ఎందుకో మీకే తెలుస్తుంది. అయన చాల కష్టాలు పడ్డారు కానీ ఆనాటి నుని నేటి వరకు ఆయన రచన లో పట్టుత్వం తగ్గలేదు. మరణం మనిషిని తీసుకెళ్లవచ్చు, అయన అందించిన మధుర ఫలాలని కాదు, అవి తెలుగు జాతి ఉన్నంత వరకు మధుర రసాలను అందిస్తూనే ఉంటాయి. రమణ గారి గురించి బాపు గారి గురించి చెప్పకపోవడం భావ్యం కాదు. రమణ గారు, మీరేం బాధ పడకండి, బాపు గార్ని మేము జగ్రతగ్గా చూసుకుంటాం, స్వర్గంలో హాస్యాన్ని పండించండి.

No comments: