హోమ్

Sunday, February 27, 2011

KSD అప్పల్రాజులో మనం మరచిపోయిన కోణం.


KSD అప్పల్రాజు చుసిన తర్వాత ఎవరన్నా ఒక్కరు ఈ అంశాన్ని స్పృశిస్తారు అనుకున్నా కాని టీవీ 9 నుంచి నా దాకా అందరం కథనం గొడవ లో పడి అసలు కథ విషయం మరచిపోయాం. ఒక రచయిత/దర్శకుడు కథ అనుకున్న దానికి తెర మీద చూసిన దానికి తేడ ఎందుకు వస్తుంది అనేది కథ. సో KSD ని ఇక్కడితో మర్చిపోయి ఈ విషయంలో ఎంత వాస్తవం ఉంది అనేది ఒకసారి ఆలోచిద్దాం.


దర్శకుడు/ స్క్రీన్ ప్లే రైటర్: KSD నే ఉదాహరణకి తీసుకుంటే  ఒక రచయిత/దర్శకుడు కథ అనుకున్న దానికి తెర మీద చూసిన దానికి తేడ ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుందో ఒక హీరో యొక్క వేదనతో చెప్పిద్దాం అనేది రాము ఆలోచన. కాని జరిగింది ఏమిటి. విషాదభరిత సినిమా తీద్దామా లేక హాస్యభరితమా అనేది ఇదమిద్ధంగా తేల్చుకోలేక దర్శకుడు ఇబ్బందిపడ్డాడు అనేది స్పస్ఫుటంగా తెలుస్తోంది, ఒక డైరెక్టర్కి సినిమా షూటింగ్ పూర్తీ అయ్యి రిలీజ్ నాటికి కుడా అది ఎలాంటి సినిమానో తేల్చుకోలేక ఒక voiceover తో ఆ కష్టాన్ని ప్రేక్షకుల మీదకి నెట్టాడు. అంటే స్క్రిప్టు స్థాయిలో పెట్టాల్సిన శ్రమని సరిగ్గా పెట్టలేదు. కావున సోదరులారా - కథని నమ్ముకోవాలి, కథ ని మాత్రమే నమ్ముకోవాలి.  ఒక స్క్రిప్టుని సినిమా మొదలు పెట్టటానికి ముందే పూర్తీ కసరత్తు చెయ్యాలి,  ఫైనలిజ్ అయినాక ఎటు వంటి పరిస్తుతులల్లో (ఆ స్క్రిప్టు demand కోసం తప్ప హీరో, నిర్మాత లేక మరొకరి కోసం) పక్కకు జరగపోవడం లాంటి "పాత కాలం" అలవాట్లు తిరిగి రావాలి. దర్శకుడికి అన్ని విభాగాల మీద అవగాహనా ఉండాలి, ఫలానా సీన్ కి   ఎంత ఖర్చు  అవుతుంది, ఎన్ని reflectors వాడాలి, ఏ లెన్స్ వాడితే తను అనుకున్న output వస్తుంది అనేది పూర్తిగా అవగాహన ఉండడంతో పాటు సినిమా ఎంత రిచ్ గా తీసాము అనేకంటే ఈ సినిమా వల్ల తనకు ఎంతపేరు వస్తుంది అనే ఆలోచన ముఖ్యం

దర్శకుడు, రచయితలకు తగిన గౌరవం ఇవ్వాలి. మన పక్కన ఉన్నా తమిళనాడు, కేరళలో డైరెక్టర్ని సార్ అని సంభోదిస్తారు సినిమా పోయినా సరే.  మనదగ్గర ఆ సంస్కృతీ చాలాకాలం క్రితమే పోయింది. .

నిర్మాత : నిర్మాత యొక్క అభిరుచి తగ్గిపోతుంది, ఎంత సేపు ఎక్కడ డబ్బు ఆదా చేద్దామా, ఖర్చుకి వెనకాడలేదు అని గొప్పలు చెప్పుకుందామా అన్న తపన తప్ప అసలు కథ ఏంటి, ఈ కథ ప్రేక్షకులకి reach అవుతుందా, ఈ దర్శకుడు ఈ కథని అనుకున్న విధంగా డీల్ చెయ్యగలడా అనేది నిర్మాతకు అవగాహనా కుదరట్లేదు. కథ, కథనంలో దమ్ము ఉంటె పెద్ద హీరో, దర్శకుల సినిమాలే కాదు అనే విషయం నిరంతరం prove అవుతున్నారిస్క్ తీసుకోలేని పరిస్థితి. చేతులు కాలక ఆకులు పట్టుకునట్టు దర్శకుడిని, హీరోని తిట్టే కంటే ముందే ఆ కథ మీద రిసెర్చ్ చెయ్యాలి. స్క్రిప్ట్ డాక్టర్స్ని కన్సల్ట్ వల్ల అభిప్రాయం తెల్సుకోవాలి. తనకంటూ ఒక పానెల్ ని ఏర్పాటు చేసుకోవాలి. 

హీరో : రెండు సినిమాలు ఇంటికి పొతే అసలుకే ఎసరు వస్తుంది అన్న విషయం తెల్సుకొని సినిమాలో హీరోయిజం కంటే కథాబలం ముఖ్యం అని తెల్సుకుంటే మంచిది. సినిమా బాగా ఆడితే రావాల్సిన పేరు అదే వస్తుంది, ఏ పాత్రలోనైనా ఓడిగిపోవాలి కాని తన కోసం స్క్రిప్టు మార్చడం అంత మూర్ఖత్వమ్ ఇంకోటి లేదు అనే విషయాన్ని గ్రహించాలి.

మ్యూజిక్ డైరెక్టర్: సంగీతం అనేది ఒక కళ. sequence ఏంటి, అక్కడ ఎలాంటి పాట కావాలి అనే విషయం తెల్సుకోవాలి, సౌండ్ చెయ్యడానికి సంగీతం వాయించడానికి చాల తేడా ఉంటుంది. పాటలు కథా గమనానికి పంటి కింద రాయిలా తగలకూడదు.

పాటల, మాటల రచయిత : ప్రాసలో నాలుగు వాక్యాలు రాస్తే అది పాట కాదు, నాలుగు పంచ్ డైలాగులు రాయగానే అదే సాహిత్యం కాదు. పాటలు కట్టాలన్నా, మాటలు రాయాలన్నాముందు తెలుగు సాహిత్యం తెలియాలి. బాష మీద పట్టు ఉండాలి, ప్రతి పదానికి అర్థము, ప్రతి పదార్ధము, నానా అర్ధాలు తెలియాలి. మహా భారత, రామాయణ గాధల్ని ఉదాహరించగలగాలి. 

స్క్రీన్ ప్లే రైటర్: ఇది ఒక్క సపరేట్ డిపార్ట్ మెంట్. ప్రతి సన్నివేశాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని, జీర్ణించుకొని, ఆ సన్నివేశంలో జీవించాలి. ఆ సీన్ పండుతుందా లేదా అనేది గమనించుకోవాలి. నవతరంగం లాంటి వాళ్ల స్క్రిప్ట్ సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలి.

క్లుప్తంగా ఎవరి బాధ్యత వారు సక్రమంగా క్రమశిక్షణతో నిర్వర్తించాలి. అన్నిటి కంటే ముఖ్యం "ఎవరి పనిని వారే చెయ్యాలి" 



No comments: