హోమ్

Wednesday, February 23, 2011

KSD అప్పలరాజు - ఎందుకు సర్, ఇలాంటి సినిమా తీసారు

JUST TELLING, THIS IS NOT A REVIEW, THIS IS ASK RAM GOPAL VARMA FEW QUESTIONS I HAVE

ఏమి జరుగుతోందో అర్థం కావట్లేదు. నా అభిమాన దర్శకుడు, ఒక శివ, క్షణ క్షణం లాంటి అత్యుత్తమ దర్శకుడు తీసిన సినిమా అంటే నమ్మబుద్ధి  కావట్లేదు, ఎందుకు ఇలా అని నిద్ర పట్టట్లేదు. వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేసే అవకాశం వస్తే ఇప్పుడే INDIA కి టికెట్ తీసుకొని వస్తాను అని చాల సార్లు అన్నాను నేను, ఇంకా అదే మాట కట్టుబడి ఉన్నాను 

కానీ ఎందుకో ఇప్పుడు భయంగా ఉంది. సినిమా బాలేదు అని కాదు, టేకింగ్ బాలేదని అంతకన్నా కాదు, రాము సునీల్ ద్వారా ఎం చెప్పించదాల్చుకున్నడో అదే జరిగింది. సునీల్ చివరికి ఎలా తల పట్టుకున్నాడో అలానే రాము పట్టుకున్నాడు. కాకపోతే సునీల్ కి రాము కి ఒకటే తేడా - రాము సినిమా మొదట్లో ఇది కామెడీ సినిమా కాదు అని చెప్పాడు, సునీల్ చెప్పాలా.

  • అసలు సినిమా మొదట్లోనే దారి తప్పింది. సినిమా నడుస్తూంటే ధియేటర్ లో పిల్లలు ఆడుకోవటం, ఎవరిదీ సర్ ఆ ఐడియా. మీరు ఎక్కడన్నా చూసారా.
  • ఇంత పెద్ద director అయిన మీరు ఎందుకు సర్ డూప్స్ ని పెట్టుకోవడం, నిన్న నిన్న వచ్చిన directors హాయిగా హీరోలని dates తీసుకొని వాడుకుంటుంటే, మీకు ఎందుకు సర్ ఆ కర్మ
  • Asst director లని creativity ఆధారంగా ఎన్నుకుంటారా, లేక రోడ్డు మీద నుండి పట్టుకోస్తారా? ఏ డైరెక్టర్ తన అసిస్టెంట్ డైరెక్టర్ అలా మాట్లాడితే ఉర్కుంటాడు. (రుద్రవీణ), మీ అసిస్టెంట్ డైరెక్టర్ అలా తిడితే మీరు ఊరుకుంటారా? (SHUT UP)  - ఆ characterisation ఏంటి సర్.
  •  అసలు గన్ను, రుద్రవీణ characters వల్ల సినిమాకి వచ్చిన లాభం ఏంటి?
  • database , దైవజ్ఞచారి లా characterization మీకు ఎబ్బెట్టు గా అనిపించలేదా...
  • ఆ background స్కోరు ఎవరిదీ సర్. కాస్త దణ్ణం పెడదామని 
  • ఎవరి పనులు వాళ్ళని చేసుకోనిక్క మనకు ఎందుకు వచ్చిన పాటలు రాసే పని సర్, అందరు ఇలా వల్ల పాటలు వల్లే రాసేసుకుంటే చంద్రబోసు, సిరివెన్నల లాంటి వాళ్ళు ఏమి కావాలి
  • IDLEBRAIN కానీండి, మరెవరైనా కానీయండి బావున్న సినిమాని బాలేదు అని రాసిన ఒక్క instance చూపించండి.  మగధీర కి, బొమ్మరిల్లుకు, వేదం కి NEGATIVE RATING ఇచ్చిన సైట్ ఒక్కటి చూపించండి.
గతంలో ఒక్క పెద్ద నిర్మాత దగ్గర నాకు రివ్యూ రాసే అవకాశం వచ్చింది, మగధీర సినిమా కి ఆయనకు సంబంధం లేదు, కాని నేను ఆయనకి రివ్యూ రాసేటప్పుడు ఓకే మాట వాడాను - ఈ సినిమాతో మిగిలిన్ దేశం అంత మన వైపు చూసి ఉల్లిక్కి పడతాయి, INDUSTRY రికార్డ్స్ తిరగ రాస్తుంది అని, తప్పని సరి పరిస్థుతులలో ఆ నిర్మాత ఆదేశం మేరకు మీ "అడవి" సినిమా ఒంటరిగా, ఒక్కడినే చూసే అవకాశం లభించింది. ఆ సినిమా టేకింగ్ కి ఎంత భయపడ్డానో, ఆ మాట చెప్తే తప్పా?
  • అసలు బాబు గారు, బాబు గారు అని బాబు గారిని అనడం ఎందుకు, ఆల్రెడీ చాల సినిమాల్లో వాడి వాడి ఎబ్బెట్టుగా తాయారు అయింది అన్న విషయం మీకు తెలిద?
  • రవితేజ గెస్ట్ ఎంట్రన్సు వల్ల లాభం? 
  • మీరు చెప్పిన చాల points ఇంతకు ముందు చాలా చాలా సార్లు చెప్పారు అనే విషయం అప్పుడప్పుడు వేరే వాళ్ల సినిమాలు చూస్తే తెలుస్తుంది.
******************************************************************
  • ఎందుకు సర్, ఇలాంటి సినిమా తీసారు, ఒక్కసారి ఈ సినిమా చూసి ఇంటికి వెళ్లి శివ చూడండి, VODKA కన్నా మీ శివ సినిమా ఎక్కువ kick ఇస్తుంది.
  • అలుపన్నది ఉందా అని "గాయం" లో  పాట విన్నాక, ఈ సాహిత్యం ఎంత బావుందో చెప్పండి. 
  • నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అని అనిపించిన మీలో ఆ కసి, పట్టుదల ఏమైంది సర్.
  • Tollywood లో మంచి హాస్య చిత్రాల పేర్లలో మీ మని, మని-మని ఉంటాయి తెలుసా.
  • background స్కోరు వల్ల సినిమా హిట్ అవుతుంది అని మేము GODFATHER చూసి తెల్సుకోలేదు, మీ శివ, క్షణ-క్షణం చూసి తెలుసుకున్నాం.
చెప్పాలి అంటే మిమ్మల్ని అభిమానించటానికి నా దగ్గర చాలా POINTS ఉన్నాయ్యి, నా అభిమాన దర్శకుడు ఎవరు అని అడిగితె నిద్రలోనయినా మీ పేరే చెబుతా (మా ఆవిడా నాలుగు పీకినా సరే) కాని కాస్త పంథా మార్చుకోండి సర్. మీ కోసం కాదు మాలాంటి అభిమానుల కోసం. 

PS : తిట్టల్సినది తిట్టి  నెయ్యి (BUTTER) రాసాడు అనుకోకండి, పెద్ద మాట ఇక్కడ వాడొచ్చో లేదో కాని - భగవంతున్ని తిట్టినా, మొక్కిన ఆ హక్కు ప్రియభక్తులకే - కాదంటారా.



3 comments:

raviteja said...

PS, కొంచెం ఎక్కువ అయ్యిందేమొ అనిపిస్తుంది బాస్

raviteja said...

ps,కొంచెం ఎక్కువ అయ్యిందేమొ అనిపిస్తుంది బాస్.

Akshu said...

రవితేజ గారు,

నా బ్లాగు చదివినందుకు మరియు మీ కామెంట్ వేసినందుకు ధన్యవాదాలు. కాస్త మోతాదు మించినమాట వాస్తవమే కాని నాకు సినిమా పట్ల అభిమానం రావటానికి కారణం వర్మ. నేను చాల కాలం తెలుగు లో సహాయ రచయితగా పనిచేసి USA వచ్చాను, ఇప్పటికి రాము గారి సినిమాలో పని చేసే అవకాశం వస్తే తిరిగి INDIA వచ్చే అంత పిచ్చి నాకు. అలాంటిది రాము ఇలాంటి సినిమా తీసేసరికి కాస్త కడుపు మండింది :)