హోమ్

Friday, February 25, 2011

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదు

ఇండియాలో ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికుల రోజు అని అది మర్యాదస్తుల కుటుంబ ఆచార వ్యవహారాలకి విరుద్హం అని చాల మంది అనుకుంటారు కాని నిజంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు మాత్రమె కాదు.

అమెరికా లో చాల వింత పద్ధతి పాటిస్తారు, మన దైనందిన రోజు సహాయపడే వాళ్ళ అందరికి కృతజ్ఞతగా THANKS GIVING DAY ని సెలెబ్రేట్ చేసినట్టే మనం ప్రేమించే వారి అందరిని అనగా తల్లి, తండ్రి, అమ్మమ్మ - తాతయ్య, నానమ్మ - తాతయ్య, బాబాయిలు-పిన్నులు, అతమ్మలు-మామయ్యలు, ఇంకా మనల్ని ప్రేమించే ఇతర బందువర్గాన్ని, మనకు చదువు నేర్పిన గురువులకు మీ ప్రేమకు ధన్యవాదములు, నేను కూడా మీరు నన్ను ఎంతైతే ఇష్టపడుతున్నారో, ప్రేమిస్తునారో, నేను కూడా మీ పట్ల అదే కృతజ్ఞత, ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఏర్పరచిన ఒక ఆచారం. 

నిజంగా మనం ఎంతమంది మన తల్లిదండ్రులకి మాకు జన్మనిచ్చినందుకు, మమ్మల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసినందుకు ధన్యవాదాలు చెప్పి. మీరు అంటే కూడా మాకు అంతే ఇష్టం అని చెప్పాము, చెప్పిన కాస్త dramatic గా ఉండదా. అలాంటివారికి ఇది ఒక అవకాశం అనమాట.

ఇక్కడ ఇంకో సంఘటన చెప్పాలి, అమెరికన్స్ ఎవరు ఏ మంచి పని చేసిన ఖచిత్తంగా THANKS చెబ్తారు. మొన్న నేను కార్లో వెళ్తుంటే ఓక సిగ్నల్ మీద రోడ్డు మధ్యలో ఒక truck లోంచి ఒక డబ్బా పడిపోయింది. అది రోడ్డుకడ్డంగా పడిపోయింది. నేను కార్ ఆపి ఆ డబ్బా పక్కన పెట్టి వచ్చాను. నేను మళ్ళి కార్ తీసేవరకు అందరు హరన్ కొట్టకుండా ఉండడం కాకుండా నేను తిఇగి కార్ వద్దకు వస్తుంటే ఒకరిద్దరు GOOD JOB అని GESTURE చేసారు. అది వారి స్వభావం.

 అందుకే వాళ్ళు THANKS GIVING DAY మరియు VALENTINES DAY జరుపుకునేది. దాన్ని మన వాళ్ళు గబ్బు పాటించారు అదే వేరే విషయం. కాబట్టి ఈ సారి FEBRUARY 14TH కి మన వారందరికీ వారు అంటే మీకు  ఇష్టం అని తెలపడం మర్చిపోకండి. 

No comments: