హోమ్

Tuesday, January 25, 2011

EVV జంధ్యాల

భక్తుల కష్టాలు తీర్చి తీర్చి దేవుడికి విసుగు వచ్చింది. అలాంటి ఒక రోజు "శ్రీ వారికి ప్రేమలేఖ" చూసి సుత్తి వీరభద్ర రావు కి వీర అభిమాని అయ్యాడు. ఆ తర్వాత ఆయనవే కొన్ని సినిమాలు చూసి ఇలాంటి వాడు నా పక్కనుంటే నా కష్టాలు సగం తీరుతాయి కదా అని 30 June 1988 నాడు ఆయనని తీసుకెళ్ళాడు.

అసలు నాదేమి ఉంది ఇది మా హాస్యబ్రహ్మ జంధ్యాల వారి పనితనం అని మన సుత్తి వారు అనగానే తన పదవికి ఎసరు పేట్టేత్తున్నాడనో లేక అయన పనితనం నచ్చిందో కాని ఆయనని లాక్కు వెళ్ళిపోయాడు.

అప్పటినుంచి ఏదో EVV గారు అలా అప్పుడప్పుడు మచ్చుకొక్కటి "ఎవడి గోల వాడిదే", "బెండు అప్పారావు RMP" అంటుంటే చూసి ఆనందపడిపోయం. బహుశా మన పాపాలు తట్టుకోలేక ఆ పైనఉన్నవాడికి శిరోభారం  ఎక్కువ అయినదో లేక వీరి బహు గొప్ప హాస్యం నచ్చినదో ఇప్పుడు అయనని కూడా తీసుకెళ్ళిపోయాడు.

EVV గారు సుదీర్ఘకాలం జంధ్యాల గారి వద్ద హాస్యానికి తన బాష్యం కనిపెట్టి మనకి కితకితలు పెట్టారు EVV. అప్పుల అప్పారావు, ఆ వక్కటి అడక్కు, హలో బ్రదర్ లాంటి సినిమాలు ఇప్పటికి మనల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి. కొన్ని సీరియస్ సినిమాలు చేసి ఆడవాళ్ళకు  దగ్గర అయినా కాని వాటిలో కూడా తన హాస్యాన్ని జొప్పించి మార్కులు కొట్టేయడం కూడా ఆయనకే చెల్లింది. చూడటానికి అన్ని ఒకేలా అనిపించినా ప్రతి సినిమాని ENJOY  చేసాము, చివరగా చేసిన కట్టి కాంతారావుతో సహా. PAISA VASOOL MAHARAJ

మొత్తానికి సున్నినతమైన కామెడి కి పెద్ద పీట వేసే వాళ్ళంతా వెళ్ళిపోయారు. మంచి హాస్య చిత్రాలకు EVV గారితో శుభం కార్డు పడింది అని నా ఫీలింగ్.

No comments: