హోమ్

Friday, January 14, 2011

షికాగో ప్రయాణం

మొత్తానికి "ఛి"కాగో వచ్చాము. అసలు బయల్దేరినప్పటి నుంచి నన్ను ఒక అనుమానం పీడిస్తోంది. ఇది షికాగోనా ఛికాగోనా. ఇంగ్లీష్ వారు దీని షికాగో అంటారు అంటా కానీ అసలు ఇంగ్లీష్ లో chi అని వ్రాస్తే ఛి కదా మరి ఇది షి ఎలా అయింది. నా ఐడియా ప్రకారం మన వాళ్ళు ఛి ఛి అంటుంటే ఇబ్బంది పడి మార్చుకున్నారేమో.  అసలు ఇంగ్లీష్ మాటలు ఇలా ఎందుకు ఉంటాయి అనేది నా మొదటి నుంచి అర్థం కాదు. మొన్నటికి మొన్న ఒక మనిషి పేరు తప్పు పలికాను, ఎం ఫీల్ అయ్యాడో ఏమో. నా పేరు ని సరిగ్గా పలికేవారు లేరు అనుకోండి. మీకో విచిత్రం చెప్పనా - ఇక్కడి వారు మన పేరు ఎలా పలకాలో తెల్సుకొని ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ 2-3 years నుంచి ఉంటున్న మన so called NRI లు మాత్రం మన పేరు కావాలని ఉచ్చరించే తీరు ఎంత విసిగిస్తుందో. సర్లే వదిలేయండి. 

మొత్తానికి షికాగో వచ్చాము డ్రైవ్ చేసుకుంటూ. న్యూ జెర్సీ నుంచి షికాగో 15  గంటల దూరం (830 miles - 1350 kms)అందునా మంచు, ఎలా అబ్బ అనుకున్నాం కానీ పర్లేదు. బానే ఉన్నాయి రోడ్లు. మొన్న నా స్నేహితుడు అన్నాడు ఇది ఇండియా కాదు అలసిపోవడానికి అన్నాడు. లవంగం గారు మీరు ఉర్కోండి రోడ్ ఎక్కడైనా ఒక్కటే ౧౫ గంటలు ఎలా డ్రైవ్ చెయ్యాలి అన్నాను కానీ నిన్న తెల్సింది. హైవె ఎక్కాక అసలు ఇబ్బంది లేదు. భలే ఉన్నాయి చుట్టూ కొండలు, ఇండియా లో ఐతే ఆపి ఫొటోస్ తీసుకోవడం అది చేసేవాళ్ళం కానీ ఇక్కడ cops  అదేనండి పోలీసులు పట్టుకుంటారు అని ఉరకున్నాం.

షికాగో కి న్యూ జెర్సీ కి చాలా తేడ ఉంది అని మొదటి చూపులో తెల్సింది, అవి ఏంటి ఎలా అనేది రేపటి టపా లో...

No comments: