అబ్బే ఇవి KCR తెలంగాణా దీక్షలో, జగనన్న విద్యార్ధి దీక్షలు లేక బాబు గారి రైతు దీక్షలు కావు. మన అయ్యప్ప, హనుమాన్ దీక్షలు లాగ అమెరికాలో అమెరికన్స్ కూడా ASH WEDNESDAY పేరుతొ దీక్షలు చేస్తారు. ముఖ్యంగా కాథాలిక్స్.
GOOD FRIDAY కి 40 రోజుల వచ్చే బుధవారంతో ఈ దీక్ష మొదలు. మనలానే ఈ దీక్షకి రూల్స్ ఉన్నాయి. నాకు తెల్సిన కొన్ని.
౧. 40 రోజుల పాటు ఈ దీక్ష ఉంటుంది
౨. దీక్ష రోజుల్లో బుధవారం శాకాహారం పాటించాలి, పెద్దలు శుక్రవారం కూడా (చాల మంది శుక్రవారం శాకాహారం పాటిస్తారుట)
౩. బుధవారం మితాహారం (మన ఒంటి పుట భోజనం)
౪.తలకి విభూతితో క్రాస్ (+) ధరించాలి.
౫. చర్చలకి వెళ్తూ ఉంది ప్రార్ధనలు చెయ్యాలి.
౬. ఈ నలభై రోజుల పాటు వారికిష్టమైన ఒక పదార్ధాన్ని త్యజించాలి.
పేరు ఏది ఐన, సంస్కృతులు సంప్రదాయాలు వేరు అయిన పద్ధతులు మారలేదు. మనం అయ్యప్ప, హనుమాన్ దీక్ష అంటాము, ముస్లిములు రంజాన్ నెల అంటారు, క్రైస్తవులు ASH WEDNESDAY అంటారు.
భగవంతుడు ఒక్కడే, అయన చెప్పిన సారం ఒక్కటే.
No comments:
Post a Comment