చేత కాని CM
చెయ్యాలని PM
రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి తన రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకుపోయే CENTRAL HOME MINISTER
అసలు HOME MINSITER RESPOSIBILITIES తెలియని STATE HOME MINISTER
దేశ రాష్ట్ర ప్రజల మనోభావాలు తెలియని సోనియమ్మా
అమ్మ ప్రాప్తం కోసం ఎదురుచూసే MP లు
తమ STAND ఎంతో చెప్పలేని పార్టీలు.
తమ పార్టీ stand ఎంతో తెలిక తికమక పడే MLA లు.
నోటు కోసం ఓటు వేసి
మాకు మేము చేటు చేసి
మాకు మేము వేసుకున్న సంకెళ్ళు
ఉరి తాడై బిగుసుకుపోతుంటే
చేత కాకా చెయ్య లేక
చేతికి గాజులు వేసుకున్న "మగ" మహారాజులం.
ఏడ్వలేక కక్కలేక
ఉక్కిరి బికిరి అవుతున్న బడుగులం
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
అన్న నినాదం పక్కన పెట్టి
దేశం కన్నా, రాష్ట్రము కన్నా వ్యక్తీ ప్రయోజనాలే ముఖ్యం
అని మన జీవితాల్ని తాకట్టు పెట్టి
బిచ్చగాడి నోటి వద్ద కూడు లాక్కునే
కోట్లు గడించే పెద్దమనుషులు,
స్విస్ బ్యాంకు అకౌంట్లు వివరాలు దాచుకునే
ప్రభుత్వాలు
ఇది నువ్వు మాకు ఇచిన స్వాతంత్రం. మహత్మా, ఇది నువ్వు కలలు కన్న రాజ్యం,
అందుకేనా స్వాతంత్రం రాగానే నీ మానాన నువ్వు పేట్టే-బెడ సర్దుకొని పోయావు.
100 సం||లు బ్రిటిష్ వారితో పోరాడి తెచుకున్న రాజ్యాన్ని
ఒక విదేశి వనిత చేతిలో పెట్టి "అన్ని" మూసుకొని కూర్చునామే.
ఇందుకేనా భగత్ సింగ్, సుబాష్ చంద్ర బోస్,ప్రాణాలు వదిలింది.
ఇందుకేనా అల్లూరి లాంటి వాళ్ళు ప్రాణాలు ఒడ్డింది
లేదు, ఏమి కాలేదు, ఏమి కాదు అని కలలు కంటూ
ఇప్పుడే నిద్ర లేసి,
కళ్ళకున్న పరదాలు తీసి
కంటి నీరు ఆగక
గుండె కోత తగ్గక
ఎవరిని నిందించాలో, ఎవరికీ సంజాయిషీ చెప్పుకోవాలో తెలిక నీకు చెబ్తున్నా, క్షమించు మహత్మా.
********************************************
ఈ దేశ చరిత్ర చూస్తే ఏముంది గర్వ కారణం,
నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం, శ్రీ శ్రీ గారి ముందు చూపు బెష్.
No comments:
Post a Comment