హోమ్

Sunday, February 27, 2011

పిచ్చి ఎవరికీ...కర్మఎవడిది

వర్మ ఒక్క చెత్త సినిమా తీసాడు,  TV 9 వాడు ఒక్క చెత్త ప్రోగ్రాం వేసాడు.
వర్మకి ప్రేక్షకుల మీద గౌరవం పోయింది, TV 9 వారు ప్రేక్షకుల పట్ల బాధ్యత మరిచారు
వర్మకి మైండ్ బ్లాక్ అయింది, TV 9 వల్ల మనకు మైండు దొబ్బింది.
వర్మ సినిమాలు ఎందుకు సినిమా తీస్తాడో తెలిదు,  మనం TV 9 ఎందుకు చూస్తామో తెలిదు

వర్మకి, TV 9 కి ఇద్దరికీ కావాల్సింది సెన్సేషన్.
అది సినిమాలు, రాజకీయాలు లేక మరేది అయిన పర్లేదు. ఇద్దరు కూడా చెత్త నుంచి కరెంట్ తీస్తారు అంటాను అనుకున్నారా కాదు, కథనం తీస్తారు, వాళ్ళ ఇష్టానుసారంగా. చూసే వాడిది కర్మ.

నన్ను నా సినిమాల్ని ఎందుకు కలుపుతారు అంటాడు వర్మ, సినిమాలు అంటూ లేకపోతె వర్మ ఎవరో మనకు తెలిసేవాడా, మనం పట్టించుకునే వాళ్ళమా అనేది విషయం రాము కి అర్థం కాలేదు

మా ప్రోగ్రాం మీద కేసు ఎందుకు వేస్తారు, మీ సినిమాలు వరసగా ఫ్లోప్ అవుతునాయి అందుకే మాకు బాధ. రాము సినిమా ఫ్లోప్ ఐతే TV 9 బాధ ఎందుకో నాకు అర్థం కాలేదు 

వర్మ తీసిన సినిమా మీద ఒక ప్రోగ్రాం వెయ్యడం చిత్రం; ఆ ప్రోగ్రాం వేసిన TV 9 మీద కేసు వేస్తా అని DGP ఆఫీసుకి వెళ్ళిన వర్మ విచిత్రం; మళ్ళి TV 9 కే వెళ్లి interview ఇవ్వడం అతి పెద్ద హాస్యాస్పదం.

ఇంతకూ పిచ్చి ఎవరికీ వర్మకా, TV 9 కా చూసే మనకా

PS : నాకు తెలుగు చానల్స్ ని మరో మెట్టు ఎక్కించిన  TV 9  అన్నా, తెలుగు సినిమాల్ని మరో మలుపు తిప్పిన వర్మ అన్నా నాకు చాల గౌరవం ఇష్టం, కానీ వారి వారి చేష్టల వాళ్ళ వారే ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు; నా వద్దే కాదు, నా లాంటి చాలా మంది వద్ద.

No comments: