హోమ్

Monday, February 14, 2011

ఫిబ్రవరి 14

ఫిబ్రవరి 14
అనుకున్నదంతా అయింది, ఇంటి నిండా బంధువులు, మెళ్ళో తాళిబొట్టు, దండలతో నేను రాజేష్. ఇప్పుడు వీళ్ళందరికీ ఎం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అసలు ఇవాళ ఇంట్లోంచి బయల్దేరుతున్నప్పుడే అనుకుంటున్నా, ఏదో జరుగుతుంది అని కాని ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. అందరు నవ్వడమే, అమ్మ తిట్లు భరించలేక మాకు పెళ్లి చేసిన "సదరు పెద్దమనిషి" ఇహనో ఇప్పుడో పారిపోవడానికి రెడీ గా ఉన్నాడు. రాజేష్ చూడు ఎలా చూస్తున్నాడో తనకేం సంబంధం లేనట్లు, వాళ్ళు బలవంతంగా తాళి కట్టిస్తున్నపుడు ఎం మాట్లాడలేదు మహానుభావుడు.

రాజేష్  పొద్దుట్నుంచి ఒక్కటే గొడవ, NECKLACE ROADకి వెళ్దాం అని, నేను సరే అన్నాను. అసలు నాకు రాజేష్  PROPOSE చేసింది కూడా ఇక్కడే, ౩ సం|| క్రితం. అప్పటి నుంచి ప్రతిసారి అక్కడే వెళ్ళడం అలవాటు. అదేంటో ఆ చెట్టు ఆ బెంచి మా కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉంటాయి. ఇవాళ కూడా అలానే కొద్దిసేపు కూర్చుందాం అని వెళ్ళాము, ఇంతలో ఎవరో ఒక గుంపు వేసుకొని వచ్చారు, ఆ గ్రూపుకి లీడర్ అనుకుంటా ఏంటి ప్రేమికులా అని అడిగాడు. రాజేష్ కాదు, నువ్వు ఎవ్వరు, నడువు ఇక్కడి నుంచి అని అన్నాడు, అంతే ఆ లీడర్ కి కోపం వచ్చేసింది, ఎంత చెబ్తున్నా వినకుండా, వీళ్ళ పక్కనే ఒక పురోహితుడు కుడా, ఏవో నాలుగు మంత్రాలు చదివాడు, ఒక పసుపు కొమ్ము రాజేష్ చేతికి ఇచి కట్టమన్నాడు, రాజేష్ ఏమి చెప్తున్నా వినిపించుకుంటేనా???

ఆ కార్యక్రమం కాగానే మా బండి పక్కనే ఉంది అన్నా కాని వినిపించుకోకుండా వాళ్ళ జీపులో ఎక్కించుకొని ఇంటి ముందు దింపారు.

ఇహ ఇంటి ముందు దిగగానే, ఇంటి ముందు ఉన్నా అమ్మలక్కలు ముక్కు మీద వేలు వేసుకొని చూస్తున్నారు, ఇదేం చోద్యం అని, చెల్లి పెళ్ళికి హాల్ బుక్ చేసుకొని రండి అని పంపిస్తే మీరు పెళ్లి చేసుకొని వచ్చారు ఏంటి అని అమ్మ ముందు నా మీద అరిచి తర్వాత ఆ "సదరు పెద్దమనిషి" తిట్టింది. సూత్రాలు లేకుండా బయటకి వెళ్ళినందుకు మా అత్తగారు, రాజేష్ వాళ్ళ అమ్మగారు నవ్వుకుంటే, ఏమి తెలియకుండా బోసి నవ్వులు చిందిస్తోంది, ఆవిడ ఒళ్లో కూర్చున్న నా కూతురు.

 ఆ కార్యక్రమం అయింది కదా తర్వాత కార్యక్రమం సంగతి చూడమంటావా అని నా కోతి చెల్లెళ్ళు అన్నప్పుడు మాత్రం నిజంగానే సిగ్గు వేసింది అంటే నమ్మండి. ప్రేమించిన మూడు నెలలకే పెళ్లి చేసుకొన్న మాకు ఈ పెళ్లి VALENTINEs DAY కానుకు అన్నమాట.

No comments: