హోమ్

Friday, February 25, 2011

అందుకే అయ్యా మీకు నా పాదాభివందనాలు

మహానుభావులారా మీకు పాదాభివందనం...

ఇప్పుడే నవతరంగం లో వచ్చిన బాపు గారి మా సినిమాలు చదివాను. అక్కడే comment వేద్దాం అనుకోని కాస్త length ఎక్కువయింది అని ఇక్కడ చెప్పడం జరిగింది. క్షమించాలి. 

ఒక్కొక సినిమా వెనుక వారి శ్రద్ధ, కార్యదీక్షత, ఓర్పు, పనితనం, ఆనాటి జ్ఞాపకాలు ఇంకా మధురంగా ఉన్నాయ్యి అంటే వాటి వెనక ఉన్న కష్టం-ఇష్టం తెలిసాయి. సినిమా అంటే ఒక కళ అని వారి పూర్వికులు చెబ్తే నిరూపించిన మహానుభావులు. ఒక్క సినిమా మీద వారి కున్న పట్టు ఏంటో ఆ ఆర్టికల్ చదివితే తెలుస్తుంది. 

అందుకే మీకు నా పాదాభివందనాలు

చిన్న చిన్న జ్ఞాపకాలు, ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ కూడా గుర్తు ఉన్నాయి అంటే ఆ రోజులో ప్రతి సంఘటనని ఏంటో సున్నిశితంగా గమనించారో అర్థం అయ్యింది. ఆ మాత్రం జాగ్రతగా తీసేరు కాబట్టే వాళ్ళు బాపు-రమణలు అయ్యారు. వారి మీద వారు వేసుకునే వ్యంగోక్తులు, తెలుగు సినిమాని ఎవరికీ అందనత్త ఎత్తుకు తీసుకువెళ్ళిన వాళ్ళలో ఆ అహం ప్రవేశించలేదనటానికి  నిదర్సనం. ఎదిగిన చెట్టు ఒదిగే ఉంటుంది అనటానికి ఇంత కన్నా నిదర్సనం ఎం కావాలి.

అందుకే మీకు నా పాదాభివందనాలు

ఒక్కో టేక్నిషియన్ని ఇంత బాగా గుర్తు పెట్టుకున్నారు అంటే టెక్నిషియన్స్  పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని సూచిస్తుంది, పెద్ద పెద్ద నటినతులకు ఇచే గౌరవం , జూ|| ఆర్టిస్ట్ పట్ల కూడా చూపించేవారు అంటే వారి ఎంతటి సున్నిత హృదయులో. హిట్ ఐతే వారి తో పనిచేసిన వారి గోప్పతన్నాని మెచ్చుకొని, సినిమా పయిన కాని ఆ సినిమాకి పనిచేసిన వారి కష్టాన్ని తలచుకోవడం వారికే చెల్లింది. 

అందుకే మీకు నా పాదాభివందనాలు

ఓ జమీందారీ గ్రామంలో ఓ రైతుకి ఒకే ఆవుండేదిట. నీదగ్గర పాడి ఎంత అని అడిగితే దొరగారివీ నావీ కలిపి వందా అనేవాట్ట. ‘మేమూ అంటే 99 ఆవులూ బాపు-రమణ గారివి' మిగితా ఆ ఒక్కటి మా తెలుగు సినిమాలవి. అందుకే అయ్యా మీకు నా పాదాభివందనాలు. (ఇది బాపు గారి "మా సినిమాలు" లోని మొదటి, చివరి వాక్యాలు ) 


మీకోసం నవతరంగం లింక్ : http://navatarangam.com/2011/02/our-films-bapu-1/

No comments: