హోమ్

Tuesday, January 25, 2011

EVV జంధ్యాల

భక్తుల కష్టాలు తీర్చి తీర్చి దేవుడికి విసుగు వచ్చింది. అలాంటి ఒక రోజు "శ్రీ వారికి ప్రేమలేఖ" చూసి సుత్తి వీరభద్ర రావు కి వీర అభిమాని అయ్యాడు. ఆ తర్వాత ఆయనవే కొన్ని సినిమాలు చూసి ఇలాంటి వాడు నా పక్కనుంటే నా కష్టాలు సగం తీరుతాయి కదా అని 30 June 1988 నాడు ఆయనని తీసుకెళ్ళాడు.

అసలు నాదేమి ఉంది ఇది మా హాస్యబ్రహ్మ జంధ్యాల వారి పనితనం అని మన సుత్తి వారు అనగానే తన పదవికి ఎసరు పేట్టేత్తున్నాడనో లేక అయన పనితనం నచ్చిందో కాని ఆయనని లాక్కు వెళ్ళిపోయాడు.

అప్పటినుంచి ఏదో EVV గారు అలా అప్పుడప్పుడు మచ్చుకొక్కటి "ఎవడి గోల వాడిదే", "బెండు అప్పారావు RMP" అంటుంటే చూసి ఆనందపడిపోయం. బహుశా మన పాపాలు తట్టుకోలేక ఆ పైనఉన్నవాడికి శిరోభారం  ఎక్కువ అయినదో లేక వీరి బహు గొప్ప హాస్యం నచ్చినదో ఇప్పుడు అయనని కూడా తీసుకెళ్ళిపోయాడు.

EVV గారు సుదీర్ఘకాలం జంధ్యాల గారి వద్ద హాస్యానికి తన బాష్యం కనిపెట్టి మనకి కితకితలు పెట్టారు EVV. అప్పుల అప్పారావు, ఆ వక్కటి అడక్కు, హలో బ్రదర్ లాంటి సినిమాలు ఇప్పటికి మనల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి. కొన్ని సీరియస్ సినిమాలు చేసి ఆడవాళ్ళకు  దగ్గర అయినా కాని వాటిలో కూడా తన హాస్యాన్ని జొప్పించి మార్కులు కొట్టేయడం కూడా ఆయనకే చెల్లింది. చూడటానికి అన్ని ఒకేలా అనిపించినా ప్రతి సినిమాని ENJOY  చేసాము, చివరగా చేసిన కట్టి కాంతారావుతో సహా. PAISA VASOOL MAHARAJ

మొత్తానికి సున్నినతమైన కామెడి కి పెద్ద పీట వేసే వాళ్ళంతా వెళ్ళిపోయారు. మంచి హాస్య చిత్రాలకు EVV గారితో శుభం కార్డు పడింది అని నా ఫీలింగ్.

Jai Ho

AR Rahman nominated for another Oscar for his ORIGINAL MUSIC for Danny Boyle's 127 Hours. This is based on a true story of A mountain climber, Aron Ralston, who is trapped under a boulder while canyoneering alone near Moab, Utah and resorts to desperate measures in order to survive.

Danny Boyle and AR Rahman won couple of Oscars (8) for their earlier film, So does their magic work again. His work is competing with 'How to Train Your Dragon' by John Powell, 'Inception' by Hans Zimmer and 'The King's Speech' by Alexandre Desplat.

So Wish Rahman sir JAI HO and keep your fingers crossed till Feb. 27, 2011

Friday, January 14, 2011

షికాగో ప్రయాణం

మొత్తానికి "ఛి"కాగో వచ్చాము. అసలు బయల్దేరినప్పటి నుంచి నన్ను ఒక అనుమానం పీడిస్తోంది. ఇది షికాగోనా ఛికాగోనా. ఇంగ్లీష్ వారు దీని షికాగో అంటారు అంటా కానీ అసలు ఇంగ్లీష్ లో chi అని వ్రాస్తే ఛి కదా మరి ఇది షి ఎలా అయింది. నా ఐడియా ప్రకారం మన వాళ్ళు ఛి ఛి అంటుంటే ఇబ్బంది పడి మార్చుకున్నారేమో.  అసలు ఇంగ్లీష్ మాటలు ఇలా ఎందుకు ఉంటాయి అనేది నా మొదటి నుంచి అర్థం కాదు. మొన్నటికి మొన్న ఒక మనిషి పేరు తప్పు పలికాను, ఎం ఫీల్ అయ్యాడో ఏమో. నా పేరు ని సరిగ్గా పలికేవారు లేరు అనుకోండి. మీకో విచిత్రం చెప్పనా - ఇక్కడి వారు మన పేరు ఎలా పలకాలో తెల్సుకొని ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ 2-3 years నుంచి ఉంటున్న మన so called NRI లు మాత్రం మన పేరు కావాలని ఉచ్చరించే తీరు ఎంత విసిగిస్తుందో. సర్లే వదిలేయండి. 

మొత్తానికి షికాగో వచ్చాము డ్రైవ్ చేసుకుంటూ. న్యూ జెర్సీ నుంచి షికాగో 15  గంటల దూరం (830 miles - 1350 kms)అందునా మంచు, ఎలా అబ్బ అనుకున్నాం కానీ పర్లేదు. బానే ఉన్నాయి రోడ్లు. మొన్న నా స్నేహితుడు అన్నాడు ఇది ఇండియా కాదు అలసిపోవడానికి అన్నాడు. లవంగం గారు మీరు ఉర్కోండి రోడ్ ఎక్కడైనా ఒక్కటే ౧౫ గంటలు ఎలా డ్రైవ్ చెయ్యాలి అన్నాను కానీ నిన్న తెల్సింది. హైవె ఎక్కాక అసలు ఇబ్బంది లేదు. భలే ఉన్నాయి చుట్టూ కొండలు, ఇండియా లో ఐతే ఆపి ఫొటోస్ తీసుకోవడం అది చేసేవాళ్ళం కానీ ఇక్కడ cops  అదేనండి పోలీసులు పట్టుకుంటారు అని ఉరకున్నాం.

షికాగో కి న్యూ జెర్సీ కి చాలా తేడ ఉంది అని మొదటి చూపులో తెల్సింది, అవి ఏంటి ఎలా అనేది రేపటి టపా లో...

Tuesday, January 11, 2011

Triple suns over China

Later this week there was an illusion created by SUN showing 3 SUN's
The illusion, deemed a legitimate astronomical phenomenon, is created by the sun being shadowed by two smaller twins and making an image of three suns. The effect is known by experts as the 'phantom sun' and unofficially called an 'ice halo'. It generally appears at this time of year when ice crystals create high clouds.
Fortunately, for astronomers and citizens of Changchun alike, the clouds have formed perfectly in order to produce reflected sunlight and the curious 'triple sun'. It also produces an arched rainbow-effect that circles the sun and two surrounding smaller suns. These are both one tenth of the size of the sun itself.
sounds strange right...thats what is nature, anything can happen...any time

I LOVE VIJAYAWADA. Welcome back to my Blog


చాలా రోజులనుంచి మా ఆవిడ నా బ్లాగ్ స్టార్ట్ చెయ్యమని అడుగుతుంటే  ఏ టాపిక్ ఐతే బావుటుంది అని ఆలోచిస్తున్నా. అనుకోకుండా  రాత్రి ఒక మంచి ఐడియా తట్టింది. నన్ను కన్న నేల - నేను ఉన్న ఈ గడ్డ, ఈ రెంటి గురించి రాస్తే ఎలా ఉంటుంది అని.

చాలా మంది NEWYORK  ని ముంబై తో పోలుస్తారు కాని Newyork  కి మన బెజవాడ కి చాలా పోలికలు ఉన్నాయి, ఎలా అంటారా - చూడండి.

  • Newyork లానే విజయవాడ కూడా బిజినెస్ capital 
  • Hudson నది Newyork అందాన్ని తెస్తే మన కృష్ణమ్మా హొయలు మనకు కనువిందు చేస్తాయి.
  • వారి స్వాతంత్ర్యానికి గుర్తుగా FRANCE వారు అమెరికా వారికి ఇచ్చిన STATUE OF LIBERTY ఇక్కడ సొగసులు పొతే, మనల్ని పాలించినందుకు గుర్తుగా కాటన్ దొర వారు నిర్మించిన PRAKASAM BARRAGE  ఠీవిగా నిల్చుంటుంది. 
  • సినిమాలు నిర్మించేది హాలీవుడ్ లోనే అయినా వాటి  బిజినెస్ అంతా  Newyork లోనే జరుగుతుంది. అలానే హైదరాబాద్ లోనే కాక ప్రపంచమంతా నిర్మించే  తెలుగు సినిమాల బిజినెస్ విజయవాడలోనే జరుగుతుంది కాదంటారా?
  • అమెరికాలోని capital పట్టణం పేరు చెప్పు అనగానే  Newyork అంటారు చాలామంది. అలానే విజయవాడ కూడా, కాని అది మా జిల్లా సెంటర్ కాదు.
  •  Newyork పట్టణం ఎప్పుడు గలగలా పారే నదిలా ఉంటుంది, విజయవాడ కుడా.
  •  Newyork lincoln tunnel & hudson tunnel ప్రతిభ అబ్బురపరిస్తే మన చిట్టినగర్ సొరంగం కూడా నేనేమి తక్కువ తినలేదు సుమీ అంటుంది. చాలాకాలం అసలు కొండని ఎందుకు తవ్వారు అని నేను ఆలోచిస్తూ ఉండిపోయ. మరో విషయం విజయవాడ లో ఆ సొరంగం ఎప్పుడు కట్టారో మీకు తెలుసా. నాకు తెలిదు, వీలైతే కనుకొన్ని చెప్పండే.
  • NEWYORK US లో మూడో పెద్ద state ఐతే విజయవాడ AP లో మూడో పెద్ద పట్టణం.
  • ఎక్కడెక్కడి వాళ్లనో NEWYORK నగరం ఆదుకొని కడుపులో దాచుకుంటే మన దుర్గమ్మ తల్లి మనందర్నీ కాపాడి చల్లగా చూస్తుంది. 
  •  HUDSON నది మధ్యలో ELLIS ISLAND మంచి tourist స్పాట్ ఐతే మనకు Bhavani Island ఉంది కదా.
ఇన్ని పోలికలు ఉన్నాయి కాబట్టి NEWYORK  నగరాన్ని మన విజయవాడతో పోల్చడం తప్పులేదు. ఏమంటారు. NEWYORK లో ఎంత తిరిగినా, చూడాల్సింది ఇంకా ఏదో మిగిలే ఉంటుంది అంటా, అలానే విజయవాడ లో ఎన్ని రోజులు ఉన్నాకలవాల్సిన వాళ్ళు ఇంకా ఉంటూనే ఉంటారు. 

I LOVE VIJAYAWADA. 

Welcome back to my Blog