హోమ్

Sunday, March 20, 2011

ఇప్పుడెం చెయ్యడం.

నాది పెద్ద సమస్య కాదు కాని... చదవండి.

పోయిన సారి KOHLS కి వెళ్ళినప్పుడు 50 % OFF లో మా అమ్మాయికి పిల్లల కెమెరా, 75 % OFF లో మా ఆవిడకి ఒక SHIRT కొన్నాను. 

మా అమ్మాయికి కొన్న కెమెరా మా అమ్మాయికి నచ్చకపోవడంతో బిల్ తీసుకొని అది వెనక్కి ఇద్దాం అని వెళ్ళాను, కనీ కార్ పార్కింగ్ లో BILL ఎక్కడో పడిపోయింది, సరే అని వెళ్లి అలాగే ఆ కెమెరా ఇచ్చాను. ఎంతకీ కొన్నారు అని అక్కడ ఉన్న అమ్మయి అడిగితె - నేను $25 కి కొన్నాను అంటే bill లేదు కాబట్టి $12 ఇస్తుంది (బిల్ లేకపోతె 50 % cut) అని తెలివిగా అసలు రేట్ చెప్పను నా డబ్బులు నాకు వస్తాయి కదా అని, వాస్తవానికి నాకు అసలు రేట్ కూడా గుర్తు లేదు అందుకని, I FORGOT అన్నాను. ఆ అమ్మాయి కింద మీద పది లాస్ట్ ౩ months లో lowest రేట్ ఇస్తాను అంటే సరే అన్నాను. డబ్బులు ఇచ్చాక చూసుకుంటే మొత్తం $50 చేతిలో పెట్టింది. అయ్యో అనుకోని వెనక్కి ఇద్దామ అంటే ఎందుకు వచ్చిన తలనొప్పి మనం ఎక్కడ ఎంత పెట్టలేదు, అని వచ్చేసాను.

ఆ shirt loose అవ్వడంతో ఇవాళ మళ్ళి KOHLS కి వెళ్ళాను, మా ఆవిడా ఈ సారి దాని తాలూకు TAG కూడా పడేసాను అంటే చేత్తబుట్టలు (నిజమే ముందు వంటింట్లో మళ్ళి తరువాత బయట ఉన్న చెత్తబుట్ట వెతికి మరి పట్టుకున్నా). ఆ TAG మీద 75 % OFF అని రాసి ఉండడంతో ఆ STICKER పీకుదాం అనుకోని పోయిన సారి ఉదంతం గుర్తుకు వచ్చి "నిజాయితీగా"  అలానే ఇచ్చాను. లేకపోతె మళ్ళి ఈ సారి $40 ఇస్తుంది అని భ్రమించా. ఈ సారి ఆ అమ్మాయి నిజంగానే నేను కట్టిన 75 % లో 60 % cut చేసుకొని $4 వస్తాయి అంది, ఇప్పుడెం చెయ్యడం. 

పోయిన సారి $25 వచ్చాయి కాబట్టి ఈ సారి $6 పోనిలే వదిలేయడమా, లేక  ఈ $6 కూడా HARD EARNED MONEY కాబట్టి ఈ సారి sticker పీక్కొని వెళ్ళడమా. (అప్పుడు నాకు నేను కట్టిన $10 కాకుండా ఇంకో $10 లేదా $30 ఎక్కువ వస్తాయి, అది నాకు ఇష్టం లేదు).

ఇలా ఆలోచిస్తూ ఇంటికి వచ్చిన నాకు KOHLS వాడు వాడి దగ్గర నేను REGULAR షాపింగ్ చేస్తునందుకు ఒక $10 GIFT CARD పంపాడు... ఇప్పుడెం చెయ్యడం :)

No comments: