హోమ్

Friday, March 11, 2011

ఎటు చుసినా ఉన్మాదం.

ప్రేమ పేరుతో ఉన్మాదం, ఉద్యమం పేరుతో ఉన్మాదం, కులం పేరుతొ ఉన్మాదం, మతం పేరుతో ఉన్మాదం, ప్రాంతాలు, దేశాల పేరుతొ ఉన్మాదం, జాతి పేరుతో ఉన్మాదం

ఎంత కాలం ఈ ఉన్మాదం, ఎక్కడ దీనికి తెర పడేది.

ప్రేమ పేరుతొ గొంతు కోసి పారిపోయిన మనోహర్ పై  ఆ రోజే నిర్దాక్షిణ్యంగా చర్య తీసుకుంటే ఇంకో అయేషా చనిపోయేది కాదు 
మొదటి సారి ఉద్యయం పేరుతొ బస్సు తగలేట్టినప్పుడు నాన్- బైయిలబుల్ వారెంట్ కింద లోపల తోస్తే ఇంకో సారి బస్సుని ముట్టుకోడు
మతం, కులం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కడిని ఉరి తీసినా తప్పులేదు 
సద్దాం ని పట్టుకున్న బుష్ కి  వచ్చిందేంటి, ఉన్న పాకిస్తాన్లో వాళ్ళు చేసుకున్న గొప్పేమిటి (కాశ్మీర్ కోసం అడగటానికి). 
పార్లమెంట్ మీద అటాక్ చేసిన వాడిని చంపేస్తే కసాబ్ అనే వాడు వచ్చేవాడే కాదు.
జాతి అన్న పదానికి నిర్వచనం నాకైతే తెలిదు. నాకు తెల్సిన జాతి మనవ జాతి.  

అభిమానం ఉండదు నేను అనను. అమ్మయిని ప్రేమించు అంటే కాని ఆ అమ్మాయి ప్రేమించకపొతే చంపడం కరెక్ట్ కాదు, నీ మతాన్ని గౌరవించు ఎదుటివాడు మతాన్ని కించ పరిచే హక్కు నీకు లేదు. నీ ప్రాంత అభివృధి ని కోరుకో కాని ఎదుటి ప్రాంతాన్ని అన్యాయం చెయ్యక్కరలేదు. ఉద్యమం చేసుకో, దానికి బస్సులు తగలబెత్తడాలు, మనుషుల్ని తన్నడాలు, విగ్రహాలు కుల్చడాలు తప్పు. 

ఉన్మాదాన్ని, ఉన్మాదిని సొంత తల్లిదండ్రులు కూడా సమర్దించరు. 

No comments: