ఆస్కార్ అందాలు 2011
Monday, February 28, 2011
Sunday, February 27, 2011
KSD అప్పల్రాజులో మనం మరచిపోయిన కోణం.
KSD అప్పల్రాజు చుసిన తర్వాత ఎవరన్నా ఒక్కరు ఈ అంశాన్ని స్పృశిస్తారు అనుకున్నా కాని టీవీ 9 నుంచి నా దాకా అందరం కథనం గొడవ లో పడి అసలు కథ విషయం మరచిపోయాం. ఒక రచయిత/దర్శకుడు కథ అనుకున్న దానికి తెర మీద చూసిన దానికి తేడ ఎందుకు వస్తుంది అనేది కథ. సో KSD ని ఇక్కడితో మర్చిపోయి ఈ విషయంలో ఎంత వాస్తవం ఉంది అనేది ఒకసారి ఆలోచిద్దాం.
దర్శకుడు/ స్క్రీన్ ప్లే రైటర్: KSD నే ఉదాహరణకి తీసుకుంటే ఒక రచయిత/దర్శకుడు కథ అనుకున్న దానికి తెర మీద చూసిన దానికి తేడ ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుందో ఒక హీరో యొక్క వేదనతో చెప్పిద్దాం అనేది రాము ఆలోచన. కాని జరిగింది ఏమిటి. విషాదభరిత సినిమా తీద్దామా లేక హాస్యభరితమా అనేది ఇదమిద్ధంగా తేల్చుకోలేక దర్శకుడు ఇబ్బందిపడ్డాడు అనేది స్పస్ఫుటంగా తెలుస్తోంది, ఒక డైరెక్టర్కి సినిమా షూటింగ్ పూర్తీ అయ్యి రిలీజ్ నాటికి కుడా అది ఎలాంటి సినిమానో తేల్చుకోలేక ఒక voiceover తో ఆ కష్టాన్ని ప్రేక్షకుల మీదకి నెట్టాడు. అంటే స్క్రిప్టు స్థాయిలో పెట్టాల్సిన శ్రమని సరిగ్గా పెట్టలేదు. కావున సోదరులారా - కథని నమ్ముకోవాలి, కథ ని మాత్రమే నమ్ముకోవాలి. ఒక స్క్రిప్టుని సినిమా మొదలు పెట్టటానికి ముందే పూర్తీ కసరత్తు చెయ్యాలి, ఫైనలిజ్ అయినాక ఎటు వంటి పరిస్తుతులల్లో (ఆ స్క్రిప్టు demand కోసం తప్ప హీరో, నిర్మాత లేక మరొకరి కోసం) పక్కకు జరగపోవడం లాంటి "పాత కాలం" అలవాట్లు తిరిగి రావాలి. దర్శకుడికి అన్ని విభాగాల మీద అవగాహనా ఉండాలి, ఫలానా సీన్ కి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని reflectors వాడాలి, ఏ లెన్స్ వాడితే తను అనుకున్న output వస్తుంది అనేది పూర్తిగా అవగాహన ఉండడంతో పాటు సినిమా ఎంత రిచ్ గా తీసాము అనేకంటే ఈ సినిమా వల్ల తనకు ఎంతపేరు వస్తుంది అనే ఆలోచన ముఖ్యం
దర్శకుడు, రచయితలకు తగిన గౌరవం ఇవ్వాలి. మన పక్కన ఉన్నా తమిళనాడు, కేరళలో డైరెక్టర్ని సార్ అని సంభోదిస్తారు సినిమా పోయినా సరే. మనదగ్గర ఆ సంస్కృతీ చాలాకాలం క్రితమే పోయింది. .
నిర్మాత : నిర్మాత యొక్క అభిరుచి తగ్గిపోతుంది, ఎంత సేపు ఎక్కడ డబ్బు ఆదా చేద్దామా, ఖర్చుకి వెనకాడలేదు అని గొప్పలు చెప్పుకుందామా అన్న తపన తప్ప అసలు కథ ఏంటి, ఈ కథ ప్రేక్షకులకి reach అవుతుందా, ఈ దర్శకుడు ఈ కథని అనుకున్న విధంగా డీల్ చెయ్యగలడా అనేది నిర్మాతకు అవగాహనా కుదరట్లేదు. కథ, కథనంలో దమ్ము ఉంటె పెద్ద హీరో, దర్శకుల సినిమాలే కాదు అనే విషయం నిరంతరం prove అవుతున్నారిస్క్ తీసుకోలేని పరిస్థితి. చేతులు కాలక ఆకులు పట్టుకునట్టు దర్శకుడిని, హీరోని తిట్టే కంటే ముందే ఆ కథ మీద రిసెర్చ్ చెయ్యాలి. స్క్రిప్ట్ డాక్టర్స్ని కన్సల్ట్ వల్ల అభిప్రాయం తెల్సుకోవాలి. తనకంటూ ఒక పానెల్ ని ఏర్పాటు చేసుకోవాలి.
హీరో : రెండు సినిమాలు ఇంటికి పొతే అసలుకే ఎసరు వస్తుంది అన్న విషయం తెల్సుకొని సినిమాలో హీరోయిజం కంటే కథాబలం ముఖ్యం అని తెల్సుకుంటే మంచిది. సినిమా బాగా ఆడితే రావాల్సిన పేరు అదే వస్తుంది, ఏ పాత్రలోనైనా ఓడిగిపోవాలి కాని తన కోసం స్క్రిప్టు మార్చడం అంత మూర్ఖత్వమ్ ఇంకోటి లేదు అనే విషయాన్ని గ్రహించాలి.
మ్యూజిక్ డైరెక్టర్: సంగీతం అనేది ఒక కళ. sequence ఏంటి, అక్కడ ఎలాంటి పాట కావాలి అనే విషయం తెల్సుకోవాలి, సౌండ్ చెయ్యడానికి సంగీతం వాయించడానికి చాల తేడా ఉంటుంది. పాటలు కథా గమనానికి పంటి కింద రాయిలా తగలకూడదు.
పాటల, మాటల రచయిత : ప్రాసలో నాలుగు వాక్యాలు రాస్తే అది పాట కాదు, నాలుగు పంచ్ డైలాగులు రాయగానే అదే సాహిత్యం కాదు. పాటలు కట్టాలన్నా, మాటలు రాయాలన్నాముందు తెలుగు సాహిత్యం తెలియాలి. బాష మీద పట్టు ఉండాలి, ప్రతి పదానికి అర్థము, ప్రతి పదార్ధము, నానా అర్ధాలు తెలియాలి. మహా భారత, రామాయణ గాధల్ని ఉదాహరించగలగాలి.
స్క్రీన్ ప్లే రైటర్: ఇది ఒక్క సపరేట్ డిపార్ట్ మెంట్. ప్రతి సన్నివేశాన్ని కూలంకషంగా అర్థం చేసుకొని, జీర్ణించుకొని, ఆ సన్నివేశంలో జీవించాలి. ఆ సీన్ పండుతుందా లేదా అనేది గమనించుకోవాలి. నవతరంగం లాంటి వాళ్ల స్క్రిప్ట్ సర్వీసెస్ ని ఉపయోగించుకోవాలి.
క్లుప్తంగా ఎవరి బాధ్యత వారు సక్రమంగా క్రమశిక్షణతో నిర్వర్తించాలి. అన్నిటి కంటే ముఖ్యం "ఎవరి పనిని వారే చెయ్యాలి"
వెంగల్లప్పకి 1/2 ర్యాంకు ఎందుకు వచ్చింది
వెంగల్లప్ప, మంగలప్ప కి annual ఎగ్జామ్స్ టైం. మంగలప్ప 5th క్లాసు. వెంగల్లప్ప 10th క్లాసు.
ఎగ్జామ్ ముందు రోజు మంగలప్ప బుక్స్ ఎవడో కొట్టేసాడు, అందుకు వెంగలప్ప తన బుక్ సగం చింపి మంగలప్పకి ఇచ్చాడు. అది తీసుకొని చదివిన మంగలప్పకి 1st ర్యాంకు వచ్చింది. కాని ఎప్పుడు 1st ర్యాంకు వచ్చే వెంగల్లప్పకి 1/2 ర్యాంకు వచ్చింది.
ఎందుకంటారు?
జోకు పాతదే, భాష్యం కొత్తది.
రజనీ కాంతా .. మజాకా
ఒక బ్లాగులో చదివి పడి పడి నవ్వుకొని నా మిత్రులకోసం ఇక్కడ ఉదహరించడం జరిగింది.
The english version for the same below
Rajinikanth was bragging to Amitabh Bachan one day, “You know, I know everyone, Just name someone, anyone, and I know them.
Tired of his boasting, Amitabh Bachan called his bluff, “OK, Rajini how about Tom Cruise?”
“Sure, yes, Tom and I are old friends, and I can prove it” Rajini said.
So Rajini and Amitabh Bachan fly out to Hollywood and knock on Tom Cruise’s door, and sure enough, Tom Cruise shouts — “Thalaiva!!! Great to see you! You and your friend come right in and join me for lunch!”
…Although impressed, Amitabh Bachan is still skeptical. After they leave Tom Cruise’s house, he tells Rajini that he thinks Rajini knowing Cruise was just lucky.
“No, no, just name anyone else” Rajini says
“President Obama”, Amitabh Bachan quickly retorts …”Yes”, Rajini says, “I know him.”
And off they go. At the White House, Obama spots Rajini on the tour and motions him, saying, — “Rajini, what a surprise, I was just on my way to a meeting, but you and your friend come on in and let’s have a cup of coffee first and catch up”.
Well, Amitabh Bachan is much shaken by now, but still not totally convinced. After they leave the White House grounds, he implores her to name anyone else.
“The Pope,” Amitabh Bachan replies …”Sure!” says Rajini, “My folks are from Italy and I’ve known the Pope
a long time”.
a long time”.
Rajini and Amitabh Bachan are assembled with the masses in Vatican Square when Rajini says, “This will never work. I can’t catch the Pope’s eye among all these people. Tell you what, I know all the guards so let me
just go upstairs and I’ll come out on the balcony with the Pope.”
just go upstairs and I’ll come out on the balcony with the Pope.”
And he disappears into the crowd headed toward the Vatican… Sure enough, half an hour later Rajini emerges with the Pope on the balcony.
But by the time Rajini returns, he finds that Amitabh Bachan has had a heart attack and is surrounded by paramedics. Working his way to Amitabh Bachan’s side, Rajini asks him, “What happened?”
Amitabh Bachan looks up and says, “I was doing fine until u and the pope came out on the balcony and the man next to me said,
*
*
*
*
“Who’s that on the balcony with Rajini?”
పిచ్చి ఎవరికీ...కర్మఎవడిది
వర్మ ఒక్క చెత్త సినిమా తీసాడు, TV 9 వాడు ఒక్క చెత్త ప్రోగ్రాం వేసాడు.
వర్మకి ప్రేక్షకుల మీద గౌరవం పోయింది, TV 9 వారు ప్రేక్షకుల పట్ల బాధ్యత మరిచారు
వర్మకి మైండ్ బ్లాక్ అయింది, TV 9 వల్ల మనకు మైండు దొబ్బింది.
వర్మ సినిమాలు ఎందుకు సినిమా తీస్తాడో తెలిదు, మనం TV 9 ఎందుకు చూస్తామో తెలిదు
వర్మకి, TV 9 కి ఇద్దరికీ కావాల్సింది సెన్సేషన్.
అది సినిమాలు, రాజకీయాలు లేక మరేది అయిన పర్లేదు. ఇద్దరు కూడా చెత్త నుంచి కరెంట్ తీస్తారు అంటాను అనుకున్నారా కాదు, కథనం తీస్తారు, వాళ్ళ ఇష్టానుసారంగా. చూసే వాడిది కర్మ.
నన్ను నా సినిమాల్ని ఎందుకు కలుపుతారు అంటాడు వర్మ, సినిమాలు అంటూ లేకపోతె వర్మ ఎవరో మనకు తెలిసేవాడా, మనం పట్టించుకునే వాళ్ళమా అనేది విషయం రాము కి అర్థం కాలేదు
మా ప్రోగ్రాం మీద కేసు ఎందుకు వేస్తారు, మీ సినిమాలు వరసగా ఫ్లోప్ అవుతునాయి అందుకే మాకు బాధ. రాము సినిమా ఫ్లోప్ ఐతే TV 9 బాధ ఎందుకో నాకు అర్థం కాలేదు
వర్మ తీసిన సినిమా మీద ఒక ప్రోగ్రాం వెయ్యడం చిత్రం; ఆ ప్రోగ్రాం వేసిన TV 9 మీద కేసు వేస్తా అని DGP ఆఫీసుకి వెళ్ళిన వర్మ విచిత్రం; మళ్ళి TV 9 కే వెళ్లి interview ఇవ్వడం అతి పెద్ద హాస్యాస్పదం.
ఇంతకూ పిచ్చి ఎవరికీ వర్మకా, TV 9 కా చూసే మనకా
PS : నాకు తెలుగు చానల్స్ ని మరో మెట్టు ఎక్కించిన TV 9 అన్నా, తెలుగు సినిమాల్ని మరో మలుపు తిప్పిన వర్మ అన్నా నాకు చాల గౌరవం ఇష్టం, కానీ వారి వారి చేష్టల వాళ్ళ వారే ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు; నా వద్దే కాదు, నా లాంటి చాలా మంది వద్ద.
Saturday, February 26, 2011
వి"చిత్రపతి"
చత్రపతి అను ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చాల కాలం నుంచి తనకు తన సహోద్యోకులకు జీతం పెరగక ఆవేదనకీ గురి అయ్యి తిరగబడి ఒక్క మనజర్ని నరికి వేయగానే అప్పల నాయుడు అనే కొత్త మేనేజర్ వచ్చాడు
చత్రపతి : ఎవడో ఒక్కడి కింద పనిచేస్తే తప్ప మాకు వేరే దారి లేదన్నావ్ . ఇప్పుడు వీడు పోయాడు . వీడి చైర్లో కి నువ్వు వస్తావా ???
మేనేజర్ : వద్దు… నీకేం కావాలి ???? చెప్పు ,,,,
చత్రపతి : ఒక్క హైకు …………… ఒక్క హైకు
ఇది మా కంపెనీ , మా వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ .. ఇదే కంపెనీ లో ఏళ్ళ తరపడి హైకు కి ఎడ్చం , బోనస్ కి ఎడ్చం , ప్రమోషన్ కి ఎడ్చం అన్ సైటులకి ఎడ్చం ..
కడుపు మాడితే Sodex ho లతో తిని , కన్నీళ్లు తాగి బతికం ... ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి , ఎవరినా వస్తే మాడిపోతారు …….
మార్చ్ పోతే సెప్టెంబర్ , సెప్టెంబర్ పోతే మార్చ్ , అదికూడా పోతే నెక్స్ట్ మార్చ్ అని హైకు లేట్ చేస్తే …..!!!!!!
అప్పల నాయుడు … శాలరీ కట్ చేసిన , కాబ్ కట్ చేసిన .. బ్లాకు మెయిల్ చేసిన లేక పోతే HR తో వచ్చిన .. … కంపెనీ లో computer లు ఎరుపు రంగుతో హీటెక్కుతాయి … పూటకో రిజిగ్నేషన్ నీ టేబుల్ మీద ఉంటాయి ……....
అగ్నిశకల ………………
తన తోటి వారితో
కడుపు మాడితే Sodex ho లతో తిని , కన్నీళ్లు తాగి బతికం ... ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి , ఎవరినా వస్తే మాడిపోతారు …….
మార్చ్ పోతే సెప్టెంబర్ , సెప్టెంబర్ పోతే మార్చ్ , అదికూడా పోతే నెక్స్ట్ మార్చ్ అని హైకు లేట్ చేస్తే …..!!!!!!
అప్పల నాయుడు … శాలరీ కట్ చేసిన , కాబ్ కట్ చేసిన .. బ్లాకు మెయిల్ చేసిన లేక పోతే HR తో వచ్చిన .. … కంపెనీ లో computer లు ఎరుపు రంగుతో హీటెక్కుతాయి … పూటకో రిజిగ్నేషన్ నీ టేబుల్ మీద ఉంటాయి ……....
అగ్నిశకల ………………
తన తోటి వారితో
ఈ రోజు నుంచి మీ అందరి బతుకులు మారాయి . PL లకి సలుటే లు , Manager లకి జిందాబాద్ కొట్టే బానిస బతుకు చచ్చింది ..
ఇక నుంచి మీకు కళ్ళు దిన్చుకోనేంది కింద keyboard చూడడానికి , కళ్ళకి మొక్కటానికి కాదు ,, తల దించుకోవలసింది Type చెయ్యడానికి Top Management కి కాదు
ఇక నుంచి పని మనది , పెత్తనం మనది , ప్రాజెక్టులు మనవి ,, కంపెనీ మనది , computerlu మనవి ..
ఈ పోరాటం బలికోరితే మీ అందరి ముందు నేనున్నా ..
మీరు ప్రోగ్రామరైతే నేను లీడ్నవుతా , మీరు లీడ్స్ అయితే నేను manger ని అవుత , మీరు మేనేజర్ లు అయితే నేను CEO ని అవుతా .
అది కాకపోతే పని ఇవ్వకుండా శాలరీ ఇచే క్లైంట్ నవుతా
జనాల రిప్లై
నువ్వు ఈ కంపెనీకి ఊరికే రాలేదురా ………. నువ్వు శివాజీవి కాదురా . నీ తోటి వాళ్ళ కోసం వచ్చిన వీర విచిత్రపతి వి ………………… తియ్యర Resume ………..
విచిత్రపతి … విచిత్రపతి … విచిత్రపతి …
ఇక నుంచి మీకు కళ్ళు దిన్చుకోనేంది కింద keyboard చూడడానికి , కళ్ళకి మొక్కటానికి కాదు ,, తల దించుకోవలసింది Type చెయ్యడానికి Top Management కి కాదు
ఇక నుంచి పని మనది , పెత్తనం మనది , ప్రాజెక్టులు మనవి ,, కంపెనీ మనది , computerlu మనవి ..
ఈ పోరాటం బలికోరితే మీ అందరి ముందు నేనున్నా ..
మీరు ప్రోగ్రామరైతే నేను లీడ్నవుతా , మీరు లీడ్స్ అయితే నేను manger ని అవుత , మీరు మేనేజర్ లు అయితే నేను CEO ని అవుతా .
అది కాకపోతే పని ఇవ్వకుండా శాలరీ ఇచే క్లైంట్ నవుతా
జనాల రిప్లై
నువ్వు ఈ కంపెనీకి ఊరికే రాలేదురా ………. నువ్వు శివాజీవి కాదురా . నీ తోటి వాళ్ళ కోసం వచ్చిన వీర విచిత్రపతి వి ………………… తియ్యర Resume ………..
విచిత్రపతి … విచిత్రపతి … విచిత్రపతి …
Friday, February 25, 2011
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కాదు
ఇండియాలో ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికుల రోజు అని అది మర్యాదస్తుల కుటుంబ ఆచార వ్యవహారాలకి విరుద్హం అని చాల మంది అనుకుంటారు కాని నిజంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు మాత్రమె కాదు.
అమెరికా లో చాల వింత పద్ధతి పాటిస్తారు, మన దైనందిన రోజు సహాయపడే వాళ్ళ అందరికి కృతజ్ఞతగా THANKS GIVING DAY ని సెలెబ్రేట్ చేసినట్టే మనం ప్రేమించే వారి అందరిని అనగా తల్లి, తండ్రి, అమ్మమ్మ - తాతయ్య, నానమ్మ - తాతయ్య, బాబాయిలు-పిన్నులు, అతమ్మలు-మామయ్యలు, ఇంకా మనల్ని ప్రేమించే ఇతర బందువర్గాన్ని, మనకు చదువు నేర్పిన గురువులకు మీ ప్రేమకు ధన్యవాదములు, నేను కూడా మీరు నన్ను ఎంతైతే ఇష్టపడుతున్నారో, ప్రేమిస్తునారో, నేను కూడా మీ పట్ల అదే కృతజ్ఞత, ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఏర్పరచిన ఒక ఆచారం.
నిజంగా మనం ఎంతమంది మన తల్లిదండ్రులకి మాకు జన్మనిచ్చినందుకు, మమ్మల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసినందుకు ధన్యవాదాలు చెప్పి. మీరు అంటే కూడా మాకు అంతే ఇష్టం అని చెప్పాము, చెప్పిన కాస్త dramatic గా ఉండదా. అలాంటివారికి ఇది ఒక అవకాశం అనమాట.
ఇక్కడ ఇంకో సంఘటన చెప్పాలి, అమెరికన్స్ ఎవరు ఏ మంచి పని చేసిన ఖచిత్తంగా THANKS చెబ్తారు. మొన్న నేను కార్లో వెళ్తుంటే ఓక సిగ్నల్ మీద రోడ్డు మధ్యలో ఒక truck లోంచి ఒక డబ్బా పడిపోయింది. అది రోడ్డుకడ్డంగా పడిపోయింది. నేను కార్ ఆపి ఆ డబ్బా పక్కన పెట్టి వచ్చాను. నేను మళ్ళి కార్ తీసేవరకు అందరు హరన్ కొట్టకుండా ఉండడం కాకుండా నేను తిఇగి కార్ వద్దకు వస్తుంటే ఒకరిద్దరు GOOD JOB అని GESTURE చేసారు. అది వారి స్వభావం.
అందుకే వాళ్ళు THANKS GIVING DAY మరియు VALENTINES DAY జరుపుకునేది. దాన్ని మన వాళ్ళు గబ్బు పాటించారు అదే వేరే విషయం. కాబట్టి ఈ సారి FEBRUARY 14TH కి మన వారందరికీ వారు అంటే మీకు ఇష్టం అని తెలపడం మర్చిపోకండి.
అందుకే అయ్యా మీకు నా పాదాభివందనాలు
మహానుభావులారా మీకు పాదాభివందనం...
ఇప్పుడే నవతరంగం లో వచ్చిన బాపు గారి మా సినిమాలు చదివాను. అక్కడే comment వేద్దాం అనుకోని కాస్త length ఎక్కువయింది అని ఇక్కడ చెప్పడం జరిగింది. క్షమించాలి.
ఒక్కొక సినిమా వెనుక వారి శ్రద్ధ, కార్యదీక్షత, ఓర్పు, పనితనం, ఆనాటి జ్ఞాపకాలు ఇంకా మధురంగా ఉన్నాయ్యి అంటే వాటి వెనక ఉన్న కష్టం-ఇష్టం తెలిసాయి. సినిమా అంటే ఒక కళ అని వారి పూర్వికులు చెబ్తే నిరూపించిన మహానుభావులు. ఒక్క సినిమా మీద వారి కున్న పట్టు ఏంటో ఆ ఆర్టికల్ చదివితే తెలుస్తుంది.
అందుకే మీకు నా పాదాభివందనాలు
చిన్న చిన్న జ్ఞాపకాలు, ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ కూడా గుర్తు ఉన్నాయి అంటే ఆ రోజులో ప్రతి సంఘటనని ఏంటో సున్నిశితంగా గమనించారో అర్థం అయ్యింది. ఆ మాత్రం జాగ్రతగా తీసేరు కాబట్టే వాళ్ళు బాపు-రమణలు అయ్యారు. వారి మీద వారు వేసుకునే వ్యంగోక్తులు, తెలుగు సినిమాని ఎవరికీ అందనత్త ఎత్తుకు తీసుకువెళ్ళిన వాళ్ళలో ఆ అహం ప్రవేశించలేదనటానికి నిదర్సనం. ఎదిగిన చెట్టు ఒదిగే ఉంటుంది అనటానికి ఇంత కన్నా నిదర్సనం ఎం కావాలి.
అందుకే మీకు నా పాదాభివందనాలు
ఒక్కో టేక్నిషియన్ని ఇంత బాగా గుర్తు పెట్టుకున్నారు అంటే టెక్నిషియన్స్ పట్ల వాళ్ళకున్న గౌరవాన్ని సూచిస్తుంది, పెద్ద పెద్ద నటినతులకు ఇచే గౌరవం , జూ|| ఆర్టిస్ట్ పట్ల కూడా చూపించేవారు అంటే వారి ఎంతటి సున్నిత హృదయులో. హిట్ ఐతే వారి తో పనిచేసిన వారి గోప్పతన్నాని మెచ్చుకొని, సినిమా పయిన కాని ఆ సినిమాకి పనిచేసిన వారి కష్టాన్ని తలచుకోవడం వారికే చెల్లింది.
అందుకే మీకు నా పాదాభివందనాలు
ఓ జమీందారీ గ్రామంలో ఓ రైతుకి ఒకే ఆవుండేదిట. నీదగ్గర పాడి ఎంత అని అడిగితే దొరగారివీ నావీ కలిపి వందా అనేవాట్ట. ‘మేమూ అంటే 99 ఆవులూ బాపు-రమణ గారివి' మిగితా ఆ ఒక్కటి మా తెలుగు సినిమాలవి. అందుకే అయ్యా మీకు నా పాదాభివందనాలు. (ఇది బాపు గారి "మా సినిమాలు" లోని మొదటి, చివరి వాక్యాలు )
మీకోసం నవతరంగం లింక్ : http://navatarangam.com/2011/02/our-films-bapu-1/
మీకోసం నవతరంగం లింక్ : http://navatarangam.com/2011/02/our-films-bapu-1/
Thursday, February 24, 2011
ప్రపంచంలో ఉన్న అన్ని చీమల బరువు ప్రపంచంలోని మనషుల బరువుకి సమానం
ప్రపంచంలో ఉన్న అన్ని చీమల బరువు ప్రపంచంలోని మనషుల బరువుకి సమానం , నమ్మరా, నేను నమ్మలా కానీ వాటికి మనకి ఉన్న నిస్పత్హి 1 : 10 లక్షలు, వాటికి కోపం వస్తే మన అందర్నీ కలిపి సముద్రంలో పడేయ గలవు అంట ఎందుకు అంటే వాటి బరువుకు రెట్టింపు బరువును మోయగలవు కాబట్టి.
కాబట్టి చీమే కదా అని చీప్ గా తీసుకున్నావో ......... అని అవి వార్నింగ్ ఇస్తాయి ఏమో.
దేవుడు అలసిపోయాడు
నిజమే, దేవుడు అలసిపోయాడు.
లేకపోతే ఎంటండి, ఎవరన్నాగంటకో పని చెబ్తేనే కోపం వస్తుంది మనకు, అలాంటిది నిమిషానికి కొన్ని కోట్ల మంది, కొన్ని వందల కోట్ల కోర్కెలు కోరితే, ఆఖరికి ఎవడన్నా విసిగిస్తే కూడా దేవుడా ఎందుకు నాకు ఈ torture ? అని అనటమే, మరి దేవుడికి విసుగు రాదా? రాకూడదా?
అందుకే RELAXATION కోసం మన రమణ గారిని పట్టుకెళ్ళారు, అయన అక్కడ నవ్వులు విర్మిజిమ్మితే ఆనందిద్దమని, దేవుడు గారు జాగ్రత్తన్డోయి, మా రమణ గారి మత్తు లో, గమత్తు లో పడి మమల్ని మర్చిపోయారు.
పాపం దేవుడన్నాక కుడా కాస్త కళాపో'స'ణ ఉండాలి మరి...
Wednesday, February 23, 2011
మా రవణ...
మా రవణ గురించి ఎంత చెప్పిన తక్కువే; ఏవన్నీ చెప్పను, ఇప్పుడు మాటలు రావట్లేదు.
నాకు మొదటి సరి రమణ గారి గురించి తెల్సింది పెళ్లి పుస్తకం సినిమా తో, అందులో dialogues నచ్చి మా నాన్నతో అన్నాను భలే ఉంటాయి బాపు గారి dialogues అని. అప్పుడు మా నాన్నారు చెప్పారు, బాపు వోడు డైలోగులు రాయరు, ఆయనెనుక రవణ అని ఒకడుంటాడు, అయన చేతి మహత్యం అని. GUESS I WAS AN INSTANT FAN
అప్పటికే కాస్త సినిమా పిచ్చి ఉండటం, ఇంట్లో సినిమాలకి ప్రోత్సాహమిచ్చే కుటుంబం కావడం వల్ల అంతకు ముందు వచ్చిన సినిమాలు చూడటం మొదలి పెట్టు అయన శైలిని గమనించాను. Dialogues అంటే పలకటానికి కష్టంగా ఉండే చాంతాడు కంటే గుర్తు పెట్టుకోవడానికి వీలుగా సరళంగా ఉంటె బెటర్ అని.
మనతో కోతి కొమచ్చి ఆడించి, మనల్ని ఉయలులూపింది మీ కందిరికి తెల్సు అనుకుంటా, ఈ మధ్య కాలం లో నేను కొన్నవి (కొన్నవి అని గమనిoచగలరు) రెండే పుస్తకాలు, ఒకటి రమణ గారి కోతి కొమచ్చి అంతకు ముందు వంశి గారి మా పసలపూడి కథలు.
అదృష్టవశాత్తు రాధాగోపాలం సినిమాకి వెళ్ళినప్పుడు బాపు, రమణ గార్లు పక్కనే కూర్చొని ఉండటం, నేను బాపు గార్ని గుర్తుపట్టి ఆశీర్వాదం తీసుకోవడం, దురదృష్టవశాత్తు పక్కనే ఉన్న రమణ గారిని గమనించక పోఅవడం, మళ్ళి వెళ్ళే లోపి INTERVAL అయ్యి సినిమా మొదలవట్టం; సినిమా అయ్యేలోపు వారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం తో అయన ఆశీర్వాదం తీసుకునే ఛాన్స్ రాలేదు.
coincidence ఏమో మరేటో గాని మా ఇంటికి ఇవాలే రమణ గారి బాల రామాయణం వచ్చింది.
నాకు అన్నింటి కన్నా ఆయనలో నచ్చింది అయన ఆత్మా విశ్వాసం, కోతి కొమచ్చి చదవండి ఎందుకో మీకే తెలుస్తుంది. అయన చాల కష్టాలు పడ్డారు కానీ ఆనాటి నుని నేటి వరకు ఆయన రచన లో పట్టుత్వం తగ్గలేదు. మరణం మనిషిని తీసుకెళ్లవచ్చు, అయన అందించిన మధుర ఫలాలని కాదు, అవి తెలుగు జాతి ఉన్నంత వరకు మధుర రసాలను అందిస్తూనే ఉంటాయి. రమణ గారి గురించి బాపు గారి గురించి చెప్పకపోవడం భావ్యం కాదు. రమణ గారు, మీరేం బాధ పడకండి, బాపు గార్ని మేము జగ్రతగ్గా చూసుకుంటాం, స్వర్గంలో హాస్యాన్ని పండించండి.
KSD అప్పలరాజు - ఎందుకు సర్, ఇలాంటి సినిమా తీసారు
JUST TELLING, THIS IS NOT A REVIEW, THIS IS ASK RAM GOPAL VARMA FEW QUESTIONS I HAVE
ఏమి జరుగుతోందో అర్థం కావట్లేదు. నా అభిమాన దర్శకుడు, ఒక శివ, క్షణ క్షణం లాంటి అత్యుత్తమ దర్శకుడు తీసిన సినిమా అంటే నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకు ఇలా అని నిద్ర పట్టట్లేదు. వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేసే అవకాశం వస్తే ఇప్పుడే INDIA కి టికెట్ తీసుకొని వస్తాను అని చాల సార్లు అన్నాను నేను, ఇంకా అదే మాట కట్టుబడి ఉన్నాను
ఏమి జరుగుతోందో అర్థం కావట్లేదు. నా అభిమాన దర్శకుడు, ఒక శివ, క్షణ క్షణం లాంటి అత్యుత్తమ దర్శకుడు తీసిన సినిమా అంటే నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకు ఇలా అని నిద్ర పట్టట్లేదు. వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేసే అవకాశం వస్తే ఇప్పుడే INDIA కి టికెట్ తీసుకొని వస్తాను అని చాల సార్లు అన్నాను నేను, ఇంకా అదే మాట కట్టుబడి ఉన్నాను
కానీ ఎందుకో ఇప్పుడు భయంగా ఉంది. సినిమా బాలేదు అని కాదు, టేకింగ్ బాలేదని అంతకన్నా కాదు, రాము సునీల్ ద్వారా ఎం చెప్పించదాల్చుకున్నడో అదే జరిగింది. సునీల్ చివరికి ఎలా తల పట్టుకున్నాడో అలానే రాము పట్టుకున్నాడు. కాకపోతే సునీల్ కి రాము కి ఒకటే తేడా - రాము సినిమా మొదట్లో ఇది కామెడీ సినిమా కాదు అని చెప్పాడు, సునీల్ చెప్పాలా.
- అసలు సినిమా మొదట్లోనే దారి తప్పింది. సినిమా నడుస్తూంటే ధియేటర్ లో పిల్లలు ఆడుకోవటం, ఎవరిదీ సర్ ఆ ఐడియా. మీరు ఎక్కడన్నా చూసారా.
- ఇంత పెద్ద director అయిన మీరు ఎందుకు సర్ డూప్స్ ని పెట్టుకోవడం, నిన్న నిన్న వచ్చిన directors హాయిగా హీరోలని dates తీసుకొని వాడుకుంటుంటే, మీకు ఎందుకు సర్ ఆ కర్మ
- Asst director లని creativity ఆధారంగా ఎన్నుకుంటారా, లేక రోడ్డు మీద నుండి పట్టుకోస్తారా? ఏ డైరెక్టర్ తన అసిస్టెంట్ డైరెక్టర్ అలా మాట్లాడితే ఉర్కుంటాడు. (రుద్రవీణ), మీ అసిస్టెంట్ డైరెక్టర్ అలా తిడితే మీరు ఊరుకుంటారా? (SHUT UP) - ఆ characterisation ఏంటి సర్.
- అసలు గన్ను, రుద్రవీణ characters వల్ల సినిమాకి వచ్చిన లాభం ఏంటి?
- database , దైవజ్ఞచారి లా characterization మీకు ఎబ్బెట్టు గా అనిపించలేదా...
- ఆ background స్కోరు ఎవరిదీ సర్. కాస్త దణ్ణం పెడదామని
- ఎవరి పనులు వాళ్ళని చేసుకోనిక్క మనకు ఎందుకు వచ్చిన పాటలు రాసే పని సర్, అందరు ఇలా వల్ల పాటలు వల్లే రాసేసుకుంటే చంద్రబోసు, సిరివెన్నల లాంటి వాళ్ళు ఏమి కావాలి
- IDLEBRAIN కానీండి, మరెవరైనా కానీయండి బావున్న సినిమాని బాలేదు అని రాసిన ఒక్క instance చూపించండి. మగధీర కి, బొమ్మరిల్లుకు, వేదం కి NEGATIVE RATING ఇచ్చిన సైట్ ఒక్కటి చూపించండి.
- అసలు బాబు గారు, బాబు గారు అని బాబు గారిని అనడం ఎందుకు, ఆల్రెడీ చాల సినిమాల్లో వాడి వాడి ఎబ్బెట్టుగా తాయారు అయింది అన్న విషయం మీకు తెలిద?
- రవితేజ గెస్ట్ ఎంట్రన్సు వల్ల లాభం?
- మీరు చెప్పిన చాల points ఇంతకు ముందు చాలా చాలా సార్లు చెప్పారు అనే విషయం అప్పుడప్పుడు వేరే వాళ్ల సినిమాలు చూస్తే తెలుస్తుంది.
******************************************************************
- ఎందుకు సర్, ఇలాంటి సినిమా తీసారు, ఒక్కసారి ఈ సినిమా చూసి ఇంటికి వెళ్లి శివ చూడండి, VODKA కన్నా మీ శివ సినిమా ఎక్కువ kick ఇస్తుంది.
- అలుపన్నది ఉందా అని "గాయం" లో పాట విన్నాక, ఈ సాహిత్యం ఎంత బావుందో చెప్పండి.
- నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అని అనిపించిన మీలో ఆ కసి, పట్టుదల ఏమైంది సర్.
- Tollywood లో మంచి హాస్య చిత్రాల పేర్లలో మీ మని, మని-మని ఉంటాయి తెలుసా.
- background స్కోరు వల్ల సినిమా హిట్ అవుతుంది అని మేము GODFATHER చూసి తెల్సుకోలేదు, మీ శివ, క్షణ-క్షణం చూసి తెలుసుకున్నాం.
చెప్పాలి అంటే మిమ్మల్ని అభిమానించటానికి నా దగ్గర చాలా POINTS ఉన్నాయ్యి, నా అభిమాన దర్శకుడు ఎవరు అని అడిగితె నిద్రలోనయినా మీ పేరే చెబుతా (మా ఆవిడా నాలుగు పీకినా సరే) కాని కాస్త పంథా మార్చుకోండి సర్. మీ కోసం కాదు మాలాంటి అభిమానుల కోసం.
PS : తిట్టల్సినది తిట్టి నెయ్యి (BUTTER) రాసాడు అనుకోకండి, పెద్ద మాట ఇక్కడ వాడొచ్చో లేదో కాని - భగవంతున్ని తిట్టినా, మొక్కిన ఆ హక్కు ప్రియభక్తులకే - కాదంటారా.
Monday, February 14, 2011
ఫిబ్రవరి 14
ఫిబ్రవరి 14
అనుకున్నదంతా అయింది, ఇంటి నిండా బంధువులు, మెళ్ళో తాళిబొట్టు, దండలతో నేను రాజేష్. ఇప్పుడు వీళ్ళందరికీ ఎం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అసలు ఇవాళ ఇంట్లోంచి బయల్దేరుతున్నప్పుడే అనుకుంటున్నా, ఏదో జరుగుతుంది అని కాని ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. అందరు నవ్వడమే, అమ్మ తిట్లు భరించలేక మాకు పెళ్లి చేసిన "సదరు పెద్దమనిషి" ఇహనో ఇప్పుడో పారిపోవడానికి రెడీ గా ఉన్నాడు. రాజేష్ చూడు ఎలా చూస్తున్నాడో తనకేం సంబంధం లేనట్లు, వాళ్ళు బలవంతంగా తాళి కట్టిస్తున్నపుడు ఎం మాట్లాడలేదు మహానుభావుడు.
రాజేష్ పొద్దుట్నుంచి ఒక్కటే గొడవ, NECKLACE ROADకి వెళ్దాం అని, నేను సరే అన్నాను. అసలు నాకు రాజేష్ PROPOSE చేసింది కూడా ఇక్కడే, ౩ సం|| క్రితం. అప్పటి నుంచి ప్రతిసారి అక్కడే వెళ్ళడం అలవాటు. అదేంటో ఆ చెట్టు ఆ బెంచి మా కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉంటాయి. ఇవాళ కూడా అలానే కొద్దిసేపు కూర్చుందాం అని వెళ్ళాము, ఇంతలో ఎవరో ఒక గుంపు వేసుకొని వచ్చారు, ఆ గ్రూపుకి లీడర్ అనుకుంటా ఏంటి ప్రేమికులా అని అడిగాడు. రాజేష్ కాదు, నువ్వు ఎవ్వరు, నడువు ఇక్కడి నుంచి అని అన్నాడు, అంతే ఆ లీడర్ కి కోపం వచ్చేసింది, ఎంత చెబ్తున్నా వినకుండా, వీళ్ళ పక్కనే ఒక పురోహితుడు కుడా, ఏవో నాలుగు మంత్రాలు చదివాడు, ఒక పసుపు కొమ్ము రాజేష్ చేతికి ఇచి కట్టమన్నాడు, రాజేష్ ఏమి చెప్తున్నా వినిపించుకుంటేనా???
ఆ కార్యక్రమం కాగానే మా బండి పక్కనే ఉంది అన్నా కాని వినిపించుకోకుండా వాళ్ళ జీపులో ఎక్కించుకొని ఇంటి ముందు దింపారు.
ఇహ ఇంటి ముందు దిగగానే, ఇంటి ముందు ఉన్నా అమ్మలక్కలు ముక్కు మీద వేలు వేసుకొని చూస్తున్నారు, ఇదేం చోద్యం అని, చెల్లి పెళ్ళికి హాల్ బుక్ చేసుకొని రండి అని పంపిస్తే మీరు పెళ్లి చేసుకొని వచ్చారు ఏంటి అని అమ్మ ముందు నా మీద అరిచి తర్వాత ఆ "సదరు పెద్దమనిషి" తిట్టింది. సూత్రాలు లేకుండా బయటకి వెళ్ళినందుకు మా అత్తగారు, రాజేష్ వాళ్ళ అమ్మగారు నవ్వుకుంటే, ఏమి తెలియకుండా బోసి నవ్వులు చిందిస్తోంది, ఆవిడ ఒళ్లో కూర్చున్న నా కూతురు.
ఆ కార్యక్రమం అయింది కదా తర్వాత కార్యక్రమం సంగతి చూడమంటావా అని నా కోతి చెల్లెళ్ళు అన్నప్పుడు మాత్రం నిజంగానే సిగ్గు వేసింది అంటే నమ్మండి. ప్రేమించిన మూడు నెలలకే పెళ్లి చేసుకొన్న మాకు ఈ పెళ్లి VALENTINEs DAY కానుకు అన్నమాట.
అనుకున్నదంతా అయింది, ఇంటి నిండా బంధువులు, మెళ్ళో తాళిబొట్టు, దండలతో నేను రాజేష్. ఇప్పుడు వీళ్ళందరికీ ఎం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అసలు ఇవాళ ఇంట్లోంచి బయల్దేరుతున్నప్పుడే అనుకుంటున్నా, ఏదో జరుగుతుంది అని కాని ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. అందరు నవ్వడమే, అమ్మ తిట్లు భరించలేక మాకు పెళ్లి చేసిన "సదరు పెద్దమనిషి" ఇహనో ఇప్పుడో పారిపోవడానికి రెడీ గా ఉన్నాడు. రాజేష్ చూడు ఎలా చూస్తున్నాడో తనకేం సంబంధం లేనట్లు, వాళ్ళు బలవంతంగా తాళి కట్టిస్తున్నపుడు ఎం మాట్లాడలేదు మహానుభావుడు.
రాజేష్ పొద్దుట్నుంచి ఒక్కటే గొడవ, NECKLACE ROADకి వెళ్దాం అని, నేను సరే అన్నాను. అసలు నాకు రాజేష్ PROPOSE చేసింది కూడా ఇక్కడే, ౩ సం|| క్రితం. అప్పటి నుంచి ప్రతిసారి అక్కడే వెళ్ళడం అలవాటు. అదేంటో ఆ చెట్టు ఆ బెంచి మా కోసమే వెయిట్ చేస్తున్నట్టు ఉంటాయి. ఇవాళ కూడా అలానే కొద్దిసేపు కూర్చుందాం అని వెళ్ళాము, ఇంతలో ఎవరో ఒక గుంపు వేసుకొని వచ్చారు, ఆ గ్రూపుకి లీడర్ అనుకుంటా ఏంటి ప్రేమికులా అని అడిగాడు. రాజేష్ కాదు, నువ్వు ఎవ్వరు, నడువు ఇక్కడి నుంచి అని అన్నాడు, అంతే ఆ లీడర్ కి కోపం వచ్చేసింది, ఎంత చెబ్తున్నా వినకుండా, వీళ్ళ పక్కనే ఒక పురోహితుడు కుడా, ఏవో నాలుగు మంత్రాలు చదివాడు, ఒక పసుపు కొమ్ము రాజేష్ చేతికి ఇచి కట్టమన్నాడు, రాజేష్ ఏమి చెప్తున్నా వినిపించుకుంటేనా???
ఆ కార్యక్రమం కాగానే మా బండి పక్కనే ఉంది అన్నా కాని వినిపించుకోకుండా వాళ్ళ జీపులో ఎక్కించుకొని ఇంటి ముందు దింపారు.
ఇహ ఇంటి ముందు దిగగానే, ఇంటి ముందు ఉన్నా అమ్మలక్కలు ముక్కు మీద వేలు వేసుకొని చూస్తున్నారు, ఇదేం చోద్యం అని, చెల్లి పెళ్ళికి హాల్ బుక్ చేసుకొని రండి అని పంపిస్తే మీరు పెళ్లి చేసుకొని వచ్చారు ఏంటి అని అమ్మ ముందు నా మీద అరిచి తర్వాత ఆ "సదరు పెద్దమనిషి" తిట్టింది. సూత్రాలు లేకుండా బయటకి వెళ్ళినందుకు మా అత్తగారు, రాజేష్ వాళ్ళ అమ్మగారు నవ్వుకుంటే, ఏమి తెలియకుండా బోసి నవ్వులు చిందిస్తోంది, ఆవిడ ఒళ్లో కూర్చున్న నా కూతురు.
ఆ కార్యక్రమం అయింది కదా తర్వాత కార్యక్రమం సంగతి చూడమంటావా అని నా కోతి చెల్లెళ్ళు అన్నప్పుడు మాత్రం నిజంగానే సిగ్గు వేసింది అంటే నమ్మండి. ప్రేమించిన మూడు నెలలకే పెళ్లి చేసుకొన్న మాకు ఈ పెళ్లి VALENTINEs DAY కానుకు అన్నమాట.
Thursday, February 10, 2011
ఆమ్లెట్ రాంబాబు
ఉత్తి అమాయకుడు మా రాంబాబు. వాడితో నా మొదటి జ్ఞాపకం ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని ఉమా medicals దగ్గర, "ఇక్కడ మందులు చాలా బాగా ఉంటాయి తెల్సా" అన్న మాటతో,. అమాయకత్వంతో మమ్మల్ని ఏదో ఓటి అనడం, బుక్ అయిపోవడం వాడి నిత్యకృత్యం. బాగా గుర్తు ఉన్నవి మాత్రం -
ఒక రోజు మెస్ లో భోజనం చేసి ఇంటికి వస్తుంటే రాంబాబు ఎదురు అయ్యాడు, అదే క్షణంలో ఎందుకో ఆమ్లెట్ తినాలి అని నాకు కోరిక కలగటం యాదృచ్చికం ఐతే మనం వేసుకొని తినాలి అని మా ఈశ్వర్ గాడికి అనిపించడం మాత్రం విచిత్రం. బ్రహ్మచారి వెధవలం నేను మొదట్లో కొన్న పొయ్యి అందులో అడుగులో మిగిలిన నాలు keresone చుక్కలు, కాని అప్పుడు తోక్కాడో ఎప్పుడో తోక్కడో కాని పాపం మా రాంబాబు, ఈశ్వర్ని ఎందుకో కేలికాడు, అంతే వాడికి తెలీకుండా వాడి సైకిల్ keys జేబులో వేసుకొని వచ్చింది కాక మళ్ళి వాడి దగ్గరే ఆమ్లెట్కి అన్ని సమకురుస్తానని మాట తీసుకున్నాం. పొద్దునే రాంబాబు ఇంట్లో చెప్పకుండా ఒక అట్లకాడ, పెనం వేసుకొని ప్రత్యక్షం. ఇక కోరిక నాది కాబట్టి "గుడ్లు" నా భాద్యత - మధ్యానం భోజనానికి వెళ్ళినప్పుడు మెస్ నుంచి గుడ్లు తెచ్చాను, మనకు అక్కడ అడ్డు-అదుపు ఉండదు, బిల్లు ఉండదు. తెలివిగా కాస్త ఉప్పు కుడా తెచ్చాను (BORN GENIUS కదా), కాని ప్రాబ్లం నూనేతోనే, బాచిలర్స్ రూములో కొబ్బరి నూనేకి దిక్కు లేదు ఇంకా వంట నూనే ఎక్కడిది. మళ్ళి మా రాంబాబు కి 2 రూ లిచ్చి నూనే తెమన్నిపంపించాము, ఎం చేసాడో ఎలా చేసాడో కాని అర గ్లాస్ నూనే తెచ్చాడు. ఏమి ఉన్నలేక పోయిన అగ్గిపెట్ట రెడీగా ఉంటుంది కాబట్టి అలా ఆమ్లెట్ వేసుకున్నాం, ఇంతలో ఇంకో "గద్ద" వచ్చి ఆమ్లెట్ ఎగరేసుకుపోయింది అనుకోండి కాని వేరే కథ. అలా రాంబాబు దయ వల్ల ఆమ్లెట్ "వేసుకున్నాం" .
కొన్ని రోజులకి నా అస్తమా మందులు అన్ని పారేస్తూ మా ఈశ్వర్ గాడు వాటిని ఒక గ్లాస్ లో వేసి అందులో వాడికి డాక్టర్ ఇచ్చిన DIGENE TONIC, ENO ANTACID వెయ్యగానే పొగలు వచ్చాయి, అది చుసిన రాంబాబు గాడు నువ్వు తాగారా దెబ్బకి పోతావు అనడం, వాడు రాంబాబు వెంటపడడం - చచ్చాము నవ్వుకోలేక. (ఆ పొగలు సాయంత్రం దాకా వస్తూనే ofcourse అందులో మేము నిమ్మకాయలు, ఉప్పు, ఆయిల్ అలా వేస్తూనే ఉన్నాం)
తలచుకుంటే నవ్వు వస్తున్నా పాపం ఆ రోజు మేము చేసిన పనికి వాడు ఎంత బాధ/ఇబ్బంది పడ్డాడో తలచుకుంటే బాధగ ఉంది. తర్వాత తర్వాత చాల కష్టాలు పడ్డాడు అని విన్నా, but never got chance to meet him, ఎక్కడ ఉన్నా, MAY GOD BLESS HIM.
Subscribe to:
Posts (Atom)