ఎప్పటి నుంచో అనుకుంటూ చూడలేక పోతున్న series ఇది. మొత్తానికి గతవారం అన్ని పనులు మానుకొని మొత్తం SEASON 1 చూసేసాను. చూసాక అనిపించింది, దీని గురించి ఎంత చెప్పిన తక్కువే అని.
కథ వరకు వస్తే అనుకోకుండా జైలుకి వెళ్లి మరణదండన విధించబడ్డ అన్నని రక్షించడానికి తమ్ముడు ఎం చేసాడు అనేది. జైల్లోంచి అన్నని ఎలా తప్పించాడు, దానికి సహకరించింది ఎవరు, ఒక్కొకరి జీవితాలు, జైల్లో జరిగే సంఘటనలు, వింతలూ భలే ఉత్కంట రేపుతుంది. అసలు HIGH సెక్యూరిటీ ఉండే జైలుని ఎలా BREAK చేసాడు, అది అమెరికాలో అనేది చాల బావుటుంది. దాంట్లో హీరోకి ఎదురయ్యే సమస్యలు, వాటినుంచి ఎలా తప్పించుకున్నాడు మన కుర్చీలో కుర్చోనివ్వవు.అసలు అన్న జైలుకి ఎందుకు వచ్చాడు, కథ ఏంటి అనేది మరో కోణంలో ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. Paul Scheuring రాసినా ఈ సీరియల్లో ప్రతి పాత్రలో నటులు ఒదిగిపోయారు. ముఖ్యంగా హీరోగా వేసిన Micheal , doctor గా వేసిన heroin , ఒక రకంగా చెప్పాలి అంటే అందరు బాగా సెట్ అయ్యారు. అసలు కథనం చెప్పిన తీరు అత్యాద్భుతం అంటే అతిశయోక్తి కాదు. ప్రతి సీన్ చాల Interesting గా, ఎక్కడ detail మిస్ కాకుండా తీసారు. మొత్తానికి ఒక మంచి NAIL BITTING సీరియల్ చూసిన అనుభూతి కలిగింది.
ఇప్పటికి season1 చూసాను, season 2 వరకు పర్లేదు, season 3 , 4 కాస్త విసిగిస్తాడు అంటునారు కానీ అన్ని season చూద్దాము అనే ప్రయత్నంలోనే ఉన్నాను. INDIA లో దొరుకుతుందో లేదో కానీ TORRENTz లో దొరుకుతుంది, ఇలాంటివి చూడాలి అంటే తప్పదు కాబట్టి తప్పు లేదు, లేదా ఎవరన్న అమెరికా నుంచి వస్తే అన్ని seasons తెప్పించుకోండి కాని మిస్ కాకండి.
PS : మన జైల్లో cell phone దొరికింది అని MEDIA గగోల్లు పెడుతుంటే, అసలు అమెరికా జైళ్ళు అంటే ఎంత స్ట్రిక్ట్ ఉంటాయో అనుకున్నా, కానీ ఇది చూసాక వ్యవస్థ ఎక్కడ అయినా ఒకటే అనిపించింది. ఈ సిరియల్ని అమెరికాలో 13 జైల్లో ban చేసారు అంటే నవ్వు వచ్చింది.
1 comment:
నాకు కూడా చాల మ౦ది స్నేహితులు చెప్పారు ఈ సెరీస్ నా తర్వాతి లిస్టు లో వుంది..థాంక్స్ మీ రివ్యూ బాగుంది..త్వరలో చుసీస్తాను నీను కూడా
Post a Comment