హోమ్

Tuesday, March 29, 2011

వెళ్ళిపోయిన నుట్టొక్క జిల్లాల అందగాడు

తన విలనిజంతో, హావ భావాలతో, హాస్యం తో మనల్ని ఉర్రుతలుగించిన మంచి మనిషి, ఆత్మ విశ్వాసానికి ఉదాహరణ, నుట్టొక్క జిల్లాల అందగాడు మన నూతన్ ప్రసాద్ గారు ఇవాళ మనల్ని విడిచి వెళ్ళిపోయారు.

MAY HIS SOUL REST IN PEACE


Monday, March 28, 2011

ఒక్క రోజు, ఒకే ఒక్క రోజు.

దరిద్రం ఒదిలింది. మొత్తానికి రిటైర్ ఐతే క్రికెట్ కి పట్టిన శని ఒదిలేది. రిక్కి పాంటింగ్, ఆస్ట్రేలియా కలిసి క్రికెట్ ని చండాలం చేసారు, ఆట కన్నా తిట్ల మీద శ్రద్ధ ఎక్కువ. మైండ్ గేమ్ ఆడుతూ జెంటిల్ మెన్ గేమ్ కి మచ్చ తెచ్చారు. ఆట క్రికెట్ ఎలా ఆడాలో మన వాళ్ళు నేర్పి పంపించారు.

మన దేశం మీద పది ఏడవడం పాకిస్తాన్ కి కొత్తేమి కాదు, చేసే వెధవ పనులన్నీ చేస్తూ పతివ్రతలా కబుర్లు చెప్పడం వారికే చెల్లింది. ముంబై దాడుల గురించి, తదనంతర పరిస్థుతుల గురించి చాల చండాలంగా మాట్లాడడం వారి మీడియా కి కొత్తేమి కాదు. గత మూడు రోజులుగా సచిన్ గురించి, మన ఆట తీరు గురించి, మనకు ఆట రాదు అని పాక్ మీడియా తెగ వార్తలు గుప్పిస్తోంది. 

ఇంకొక్క రోజు, అన్ని నోళ్ళు మూతబడాటానికి, ఇంకో నాలుగు రోజులు చరిత్ర ఆవిష్కరించడానికి. 

COME IN TEAM INDIA, ALL THE BEST. LIVE TO THE DREAM OF MILLIONS OF INDIANS.SHOW WHAT WE ARE ... IN CRICKET FIELD OR THE BATTLE FIELD.  

అన్ని రాష్ట్రాలని అధిగమిస్తున్నాం

ఎవరు అనరు మన రాష్ట్రము వెనకబడిపోయింది అని. అన్ని రాష్ట్రాలని అధిగమిస్తున్నాం

అవినీతి లో మనమే ఢిల్లీతో సమానం,
అల్లర్లలో కాశ్మిరుకి తీసిపోము,
మాఫియ, డ్రగ్స్ లో ముంబై,
రాజస్తాన్ లో ఎడారి ఉంటె మన రాష్ట్రము ఇప్పుడు ఇంకా పెద్ద ఎడారి, (తాగడానికి గుక్క నీరు లేని పల్లెలు ఎన్నో అనంతపురం, నల్గొండ జిల్లాల్లో)
ఇంకా ఇవాళ అసెంబ్లీలో జరిగిన గొడవతో బీహార్ ని చేరుకున్నాం.
అర్థం లేని వ్యర్థ ఎన్నికల హమిలల్లో తమిళనాడుతో సమానం.
వెనకబాటు లో చత్తిస్ ఘడ్,

దేశం లో ఎక్కడ నేరం జరిగినా మనకు సంబంధం తప్పకుండ ఉంటుంది.
ఇంకేం ఉంది మన దగ్గరలేంది. అన్ని అవలక్షనాలకి పరాకాష్టలో ఉన్నాము. 

Friday, March 25, 2011

PRISON BREAK.


ఎప్పటి నుంచో అనుకుంటూ చూడలేక పోతున్న series ఇది. మొత్తానికి గతవారం అన్ని పనులు మానుకొని మొత్తం SEASON 1 చూసేసాను. చూసాక అనిపించింది, దీని గురించి ఎంత చెప్పిన తక్కువే అని. 

కథ వరకు వస్తే అనుకోకుండా జైలుకి వెళ్లి మరణదండన విధించబడ్డ అన్నని రక్షించడానికి తమ్ముడు ఎం చేసాడు అనేది. జైల్లోంచి అన్నని ఎలా తప్పించాడు, దానికి సహకరించింది ఎవరు, ఒక్కొకరి జీవితాలు, జైల్లో జరిగే సంఘటనలు, వింతలూ భలే ఉత్కంట రేపుతుంది. అసలు HIGH సెక్యూరిటీ ఉండే జైలుని ఎలా BREAK చేసాడు, అది అమెరికాలో అనేది చాల బావుటుంది. దాంట్లో హీరోకి ఎదురయ్యే సమస్యలు, వాటినుంచి ఎలా తప్పించుకున్నాడు మన కుర్చీలో కుర్చోనివ్వవు.అసలు అన్న జైలుకి ఎందుకు వచ్చాడు, కథ ఏంటి అనేది మరో కోణంలో ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.  Paul Scheuring రాసినా ఈ సీరియల్లో ప్రతి పాత్రలో నటులు ఒదిగిపోయారు. ముఖ్యంగా హీరోగా వేసిన Micheal , doctor గా వేసిన heroin , ఒక రకంగా చెప్పాలి అంటే అందరు బాగా సెట్ అయ్యారు. అసలు కథనం చెప్పిన తీరు అత్యాద్భుతం అంటే అతిశయోక్తి కాదు. ప్రతి సీన్ చాల Interesting గా, ఎక్కడ detail మిస్ కాకుండా తీసారు. మొత్తానికి ఒక మంచి NAIL BITTING సీరియల్ చూసిన అనుభూతి కలిగింది.

ఇప్పటికి  season1 చూసాను, season 2 వరకు పర్లేదు, season 3 , 4 కాస్త విసిగిస్తాడు అంటునారు కానీ అన్ని season చూద్దాము అనే ప్రయత్నంలోనే ఉన్నాను. INDIA లో దొరుకుతుందో లేదో కానీ TORRENTz లో దొరుకుతుంది, ఇలాంటివి చూడాలి అంటే తప్పదు కాబట్టి తప్పు లేదు, లేదా ఎవరన్న అమెరికా నుంచి వస్తే అన్ని seasons తెప్పించుకోండి కాని మిస్ కాకండి.

PS : మన జైల్లో cell phone దొరికింది అని MEDIA గగోల్లు పెడుతుంటే, అసలు అమెరికా జైళ్ళు అంటే ఎంత స్ట్రిక్ట్ ఉంటాయో అనుకున్నా, కానీ ఇది చూసాక వ్యవస్థ ఎక్కడ అయినా ఒకటే అనిపించింది. ఈ సిరియల్ని అమెరికాలో 13 జైల్లో ban చేసారు అంటే నవ్వు వచ్చింది.

Sunday, March 20, 2011

ఇప్పుడెం చెయ్యడం.

నాది పెద్ద సమస్య కాదు కాని... చదవండి.

పోయిన సారి KOHLS కి వెళ్ళినప్పుడు 50 % OFF లో మా అమ్మాయికి పిల్లల కెమెరా, 75 % OFF లో మా ఆవిడకి ఒక SHIRT కొన్నాను. 

మా అమ్మాయికి కొన్న కెమెరా మా అమ్మాయికి నచ్చకపోవడంతో బిల్ తీసుకొని అది వెనక్కి ఇద్దాం అని వెళ్ళాను, కనీ కార్ పార్కింగ్ లో BILL ఎక్కడో పడిపోయింది, సరే అని వెళ్లి అలాగే ఆ కెమెరా ఇచ్చాను. ఎంతకీ కొన్నారు అని అక్కడ ఉన్న అమ్మయి అడిగితె - నేను $25 కి కొన్నాను అంటే bill లేదు కాబట్టి $12 ఇస్తుంది (బిల్ లేకపోతె 50 % cut) అని తెలివిగా అసలు రేట్ చెప్పను నా డబ్బులు నాకు వస్తాయి కదా అని, వాస్తవానికి నాకు అసలు రేట్ కూడా గుర్తు లేదు అందుకని, I FORGOT అన్నాను. ఆ అమ్మాయి కింద మీద పది లాస్ట్ ౩ months లో lowest రేట్ ఇస్తాను అంటే సరే అన్నాను. డబ్బులు ఇచ్చాక చూసుకుంటే మొత్తం $50 చేతిలో పెట్టింది. అయ్యో అనుకోని వెనక్కి ఇద్దామ అంటే ఎందుకు వచ్చిన తలనొప్పి మనం ఎక్కడ ఎంత పెట్టలేదు, అని వచ్చేసాను.

ఆ shirt loose అవ్వడంతో ఇవాళ మళ్ళి KOHLS కి వెళ్ళాను, మా ఆవిడా ఈ సారి దాని తాలూకు TAG కూడా పడేసాను అంటే చేత్తబుట్టలు (నిజమే ముందు వంటింట్లో మళ్ళి తరువాత బయట ఉన్న చెత్తబుట్ట వెతికి మరి పట్టుకున్నా). ఆ TAG మీద 75 % OFF అని రాసి ఉండడంతో ఆ STICKER పీకుదాం అనుకోని పోయిన సారి ఉదంతం గుర్తుకు వచ్చి "నిజాయితీగా"  అలానే ఇచ్చాను. లేకపోతె మళ్ళి ఈ సారి $40 ఇస్తుంది అని భ్రమించా. ఈ సారి ఆ అమ్మాయి నిజంగానే నేను కట్టిన 75 % లో 60 % cut చేసుకొని $4 వస్తాయి అంది, ఇప్పుడెం చెయ్యడం. 

పోయిన సారి $25 వచ్చాయి కాబట్టి ఈ సారి $6 పోనిలే వదిలేయడమా, లేక  ఈ $6 కూడా HARD EARNED MONEY కాబట్టి ఈ సారి sticker పీక్కొని వెళ్ళడమా. (అప్పుడు నాకు నేను కట్టిన $10 కాకుండా ఇంకో $10 లేదా $30 ఎక్కువ వస్తాయి, అది నాకు ఇష్టం లేదు).

ఇలా ఆలోచిస్తూ ఇంటికి వచ్చిన నాకు KOHLS వాడు వాడి దగ్గర నేను REGULAR షాపింగ్ చేస్తునందుకు ఒక $10 GIFT CARD పంపాడు... ఇప్పుడెం చెయ్యడం :)

Wednesday, March 16, 2011

నిజమా

When Graham Bell invented the telephone...he had two missed calls from Rajnikanth.
- Old Saying



BTW...he does not need phone to call.  



Tuesday, March 15, 2011

అమెరికాలో దీక్షలు



అబ్బే ఇవి KCR తెలంగాణా దీక్షలో, జగనన్న విద్యార్ధి దీక్షలు లేక బాబు గారి రైతు దీక్షలు కావు. మన అయ్యప్ప, హనుమాన్ దీక్షలు లాగ అమెరికాలో అమెరికన్స్ కూడా ASH WEDNESDAY పేరుతొ దీక్షలు చేస్తారు. ముఖ్యంగా కాథాలిక్స్. 

GOOD FRIDAY కి 40 రోజుల వచ్చే బుధవారంతో ఈ దీక్ష మొదలు. మనలానే ఈ దీక్షకి రూల్స్ ఉన్నాయి. నాకు తెల్సిన కొన్ని.

౧. 40 రోజుల పాటు ఈ దీక్ష ఉంటుంది
౨. దీక్ష రోజుల్లో బుధవారం శాకాహారం పాటించాలి, పెద్దలు శుక్రవారం కూడా (చాల మంది శుక్రవారం శాకాహారం పాటిస్తారుట)
౩. బుధవారం మితాహారం (మన ఒంటి పుట భోజనం)
౪.తలకి విభూతితో క్రాస్ (+) ధరించాలి.
౫. చర్చలకి వెళ్తూ ఉంది ప్రార్ధనలు చెయ్యాలి.
౬. ఈ నలభై రోజుల పాటు వారికిష్టమైన ఒక పదార్ధాన్ని త్యజించాలి.

పేరు ఏది ఐన, సంస్కృతులు సంప్రదాయాలు వేరు అయిన పద్ధతులు మారలేదు. మనం అయ్యప్ప, హనుమాన్ దీక్ష అంటాము, ముస్లిములు రంజాన్ నెల అంటారు, క్రైస్తవులు ASH WEDNESDAY అంటారు. 

                     భగవంతుడు ఒక్కడే, అయన చెప్పిన సారం ఒక్కటే. 

పచ్చ పచ్చని కార్లు, కాలుష్యం లేని కార్లు

ఎప్పటికోస్తాయో కాని... నాకు ఈ మొదటి కార్ బాగా నచ్చింది.



Monday, March 14, 2011

గంట పోయింది

అవునండి, మా జీవితాలనుంచి  ఒక గంట పోయింది. హాయిగా 7 . 30 దాక పడుకునే వాణ్ణి, ఇప్పుడు 6 .30 కే లేవాలి. 
అయినా ఇలా ఒక కంట తీసుకుంటే ఎలా? పోనీ ఏదో ఒక రోజు రెండు రోజులు కాదు. నవంబర్ దాకా. దీనికి DAY LIGHT SAVING అని పేరు 

గంట ముందు లేచేసరికి ఆఫీసు లో ఒకటే నిద్ర బద్ధకం, మా బాసు ఏమో తినేటట్టు చూపులు, అవలించినప్పుడు అలా. మరి నిద్ర ఏమో తెగ వస్తోంది. ఎం చేస్తాం. అమెరికా లో ఇప్పటి నుంచి నవంబర్ దాక ఈ DAY LIGHT SAVING ఉంటుంది. summer లో ఎండ తొందరగా వస్తుంది కాబట్టి తొందరగా పనులు చేసుకుందాం అని ఒక గంట ముందుకి తిప్పుతారు. 

అంటే ఇప్పుడు హైదరాబాద్ కి న్యూయార్క్ కి TIME DIFFERENCE 9 1/2 hours

జపాన్ భీభత్సానికి ముందు - తర్వాత

మళ్ళి అంత అభివృధి చెందాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో...







సేందాయ్ విమానాశ్రయం
photos by NY Times

Sunday, March 13, 2011

ఎం పాపం చేసాం

ఎం  పాపం  చేసాం , ఎం  TV కొనుక్కోవడమే  మా  నేరమా, దానికి  Dish పెట్టిన్చుక్కోవడమే  మా  పాపమా. ఉషాకిరణ్  సంస్థ  నుంచి  మంచి  సినిమాలు  వస్తునాయి  అని  ఆదరించం  కానీ  అదే  మా  పాలిట  శాపం  అవుతుంది  అని  ఉహించలేదే. ప్రియ  పచ్చళ్ళు బావున్నాయి అని తెగ తిన్నాం కానీ ఇలా సైనైడ్ అవుతుంది అని తెలియలేదే.

అసలే రాష్ట్రం లో ఉద్యమాలు, దేశం లో అవినీతి. ఇప్పుడా మా మీద కక్ష్య తీర్చుకునేది. అసలే JAPAN భూకంపం భయం పోలేదు, ఇంకా సునామి భయం తొలగలేదు. ఇప్పుడా మా మీద ఈ అటాక్. హుమ్మ్... ఎం చేస్తాం మనుషులకి కాకా ఇంకెవరికి ఈ కష్టాలు.

అమెరికా లో ఉండి బ్రతికి పోయాను కాని అక్కడ మా అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి. మొన్నే పుట్టి పాపం ఇప్పుడిప్పుడే పాకుతున్న నా మేనల్లుడు భయపడడు. పాపం ఇంజనీరింగ్ చదివి త్వరలో మంచి ఉద్యోగంలో జాయిన్ కాబోతున్న నా తమ్ముడు పరిస్థితి.

ఇంతకీ ఈ గోల ఏంటి అంటారా, అమ్మో విషయం ఏంటో బయటకి చెప్తే ALL INDIA ETV SUMAN J.A.C. నా మీద అటాక్ చేస్తే...నేను చెప్పను. 

Friday, March 11, 2011

తెలంగాణా వీరులు ఇప్పుడు ఏమి అంటారు.




నా తెలంగాణా

నేను పుట్టింది ఆంధ్రలోనే కాని, నాకు ఉహ తెల్సింది తెలంగాణా లో 
నేను పాకింది తెలంగాణలో, నేను నడిచింది తెలంగాణలో, 
నేను విన్న మొదటి మాట తెలంగాణలో, నేను తిన్న మొదటి ముద్దా తెలంగాణలో.
నా అన్నప్రాసన తెలంగాణలో, నా అక్షరాభ్యాసం తెలంగాణలో.

నేను నవ్వింది ఏడ్చింది తెలంగాణలో, 
నా హితులు నా స్నేహితులు తెలంగాణలో.
నా గురువులు మార్గదర్శకులు తెలంగాణలో, 
నా నేర్చుకున్న సంస్కృతీ, సంప్రదాయాలు తెలంగాణలో

ఇక్కడి వారి కష్టాలు, నష్టాలు తెల్సు
వారి వేదన, ఆవేదన తెల్సు
నిష్కల్మషమైన వారి ప్రేమ తెల్సు, 
ముప్పై ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్న వారి అభిమానం తెల్సు.

ఈ ప్రేమ లో, అభిమానంలో ఏనాడు ఇట్లాంటి కుతంత్రాలు లేవు. ఎవరు కూడా నేటికి ఈ విధ్వంస సంస్కృతిని ప్రోత్సహించట్లేదు. 
నాకు తెల్సిన తెలంగాణా వారు ఏనాడు ఇలాంటి పనులు చెయ్యరు, ఇది తెలంగాణా వారి పని కాదు. కాదు కాకూడదు.

దీని ఉద్దేశ్యం ఈ పని ఆంధ్ర వారు చేసారు అని కాదు; తెలంగాణా సంస్కృతి మర్చిపోయి ఉన్మాదమే ఉద్యమం అనుకుంటున్న వారు. 
వీరు తెలంగాణా కోరే వాళ్ళు కాదు, తెలంగాణ ద్రోహులు

ఎటు చుసినా ఉన్మాదం.

ప్రేమ పేరుతో ఉన్మాదం, ఉద్యమం పేరుతో ఉన్మాదం, కులం పేరుతొ ఉన్మాదం, మతం పేరుతో ఉన్మాదం, ప్రాంతాలు, దేశాల పేరుతొ ఉన్మాదం, జాతి పేరుతో ఉన్మాదం

ఎంత కాలం ఈ ఉన్మాదం, ఎక్కడ దీనికి తెర పడేది.

ప్రేమ పేరుతొ గొంతు కోసి పారిపోయిన మనోహర్ పై  ఆ రోజే నిర్దాక్షిణ్యంగా చర్య తీసుకుంటే ఇంకో అయేషా చనిపోయేది కాదు 
మొదటి సారి ఉద్యయం పేరుతొ బస్సు తగలేట్టినప్పుడు నాన్- బైయిలబుల్ వారెంట్ కింద లోపల తోస్తే ఇంకో సారి బస్సుని ముట్టుకోడు
మతం, కులం గురించి మాట్లాడిన ప్రతి ఒక్కడిని ఉరి తీసినా తప్పులేదు 
సద్దాం ని పట్టుకున్న బుష్ కి  వచ్చిందేంటి, ఉన్న పాకిస్తాన్లో వాళ్ళు చేసుకున్న గొప్పేమిటి (కాశ్మీర్ కోసం అడగటానికి). 
పార్లమెంట్ మీద అటాక్ చేసిన వాడిని చంపేస్తే కసాబ్ అనే వాడు వచ్చేవాడే కాదు.
జాతి అన్న పదానికి నిర్వచనం నాకైతే తెలిదు. నాకు తెల్సిన జాతి మనవ జాతి.  

అభిమానం ఉండదు నేను అనను. అమ్మయిని ప్రేమించు అంటే కాని ఆ అమ్మాయి ప్రేమించకపొతే చంపడం కరెక్ట్ కాదు, నీ మతాన్ని గౌరవించు ఎదుటివాడు మతాన్ని కించ పరిచే హక్కు నీకు లేదు. నీ ప్రాంత అభివృధి ని కోరుకో కాని ఎదుటి ప్రాంతాన్ని అన్యాయం చెయ్యక్కరలేదు. ఉద్యమం చేసుకో, దానికి బస్సులు తగలబెత్తడాలు, మనుషుల్ని తన్నడాలు, విగ్రహాలు కుల్చడాలు తప్పు. 

ఉన్మాదాన్ని, ఉన్మాదిని సొంత తల్లిదండ్రులు కూడా సమర్దించరు. 

క్షమించు మహాత్మా.




చేత కాని CM 
చెయ్యాలని PM 
రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసి తన రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకుపోయే CENTRAL HOME MINISTER 
అసలు HOME MINSITER RESPOSIBILITIES తెలియని STATE HOME MINISTER 

దేశ రాష్ట్ర ప్రజల మనోభావాలు తెలియని సోనియమ్మా 
అమ్మ ప్రాప్తం కోసం ఎదురుచూసే MP లు 
తమ STAND ఎంతో చెప్పలేని పార్టీలు.
తమ పార్టీ stand ఎంతో తెలిక తికమక పడే MLA లు. 

నోటు కోసం ఓటు వేసి
మాకు మేము చేటు చేసి
మాకు మేము వేసుకున్న సంకెళ్ళు 
ఉరి తాడై బిగుసుకుపోతుంటే 

చేత కాకా చెయ్య లేక 
చేతికి గాజులు వేసుకున్న "మగ" మహారాజులం.
ఏడ్వలేక కక్కలేక 
ఉక్కిరి బికిరి అవుతున్న బడుగులం

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్
అన్న నినాదం పక్కన పెట్టి
దేశం కన్నా, రాష్ట్రము కన్నా వ్యక్తీ ప్రయోజనాలే ముఖ్యం 
అని మన జీవితాల్ని తాకట్టు పెట్టి

బిచ్చగాడి నోటి వద్ద కూడు లాక్కునే
కోట్లు గడించే పెద్దమనుషులు, 
స్విస్ బ్యాంకు అకౌంట్లు వివరాలు దాచుకునే
ప్రభుత్వాలు

ఇది నువ్వు మాకు ఇచిన స్వాతంత్రం. మహత్మా, ఇది నువ్వు కలలు కన్న రాజ్యం, 
అందుకేనా స్వాతంత్రం రాగానే నీ మానాన నువ్వు పేట్టే-బెడ సర్దుకొని పోయావు. 
100 సం||లు బ్రిటిష్ వారితో పోరాడి తెచుకున్న రాజ్యాన్ని 
ఒక విదేశి వనిత చేతిలో పెట్టి "అన్ని" మూసుకొని కూర్చునామే. 

ఇందుకేనా భగత్ సింగ్, సుబాష్ చంద్ర బోస్,ప్రాణాలు వదిలింది.
ఇందుకేనా అల్లూరి లాంటి వాళ్ళు ప్రాణాలు ఒడ్డింది

లేదు, ఏమి కాలేదు, ఏమి కాదు అని కలలు కంటూ 

ఇప్పుడే నిద్ర లేసి,
కళ్ళకున్న పరదాలు తీసి
కంటి నీరు ఆగక
గుండె కోత తగ్గక

ఎవరిని నిందించాలో, ఎవరికీ సంజాయిషీ చెప్పుకోవాలో తెలిక నీకు చెబ్తున్నా, క్షమించు మహత్మా.

********************************************


ఈ దేశ చరిత్ర చూస్తే ఏముంది గర్వ కారణం, 
నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం, శ్రీ శ్రీ గారి ముందు చూపు బెష్.

Wednesday, March 02, 2011