విషయానికి వస్తే అసలు ఇంత మంచి టైటిల్ కి సినిమా కి సంబంధం ఏంటో దర్శకుడే చెప్పాలి. నాకైతే ఏమి కనిపించలేదు. అసలు ఇది ఎ రకం సినిమానో అర్థం కాలేదు. ఒక మంచి ఆలోచనని సరిగ్గా ఆచరణ లో పెట్టలేక పోయాడు సతీష్ కసేట్టి.
Kshunanga చూస్తే ఈ సినిమాలో మూడు అంశాలు ఉన్నాయి. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, గురువు - శిష్యురాలి బంధం, తల్లి తండ్రులను కలపడం. ఇలాంటి కథ అల్లాలి అంటే చాల ధైర్యం కావాలి. ఎక్కడ ఈ మూడు పాయింట్స్ కి అన్యాయం జరగకూడదు. అలా అని సినిమా ని లాగకూడదు. ఇక్కడ జరిగిన మిస్టేక్ అదే.
- అసలు హీరో హీరోయిన్స్ ని అంత సేపు విడిగా ఉంచడం ఎందుకు అనేది అర్థం కాదు. ముందే కలిపేస్తే సబ్జెక్టు లో ఎమన్నా నష్టం ఉందా?
- పోనీ ప్రేమ కథ కింద తీసుకుందాం అంటే వాళ్ళ మధ్య సెకండ్ హాఫ్ లో ఎన్ని సీన్స్ ఉన్నాయి?
- సంగీత ప్రధానమైన సినిమా అనుకుందాం అనుకుంటే ఎక్కడ ఒక్క సరైన కీర్తన వినపడిందా?
- అసలు శిష్య రికం చెయ్యడానికి ఒక్క పాట అయిన నేర్చుకునట్టు చూపించాలేదు.
- ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అసలు పస లేదు. తల్లి ఇల్లు విడిచి పెట్టి వెళ్ళడానికి కారణం లేదు. భర్త దగ్గర నుంచి ఎలాగు అతని సంపాదన లేదు కదా? అలంటి అప్పుడు అక్కడ నుంచి వెళ్ళడం ఎందుకో అర్థం కాదు. అదే ఆమెకు ఉద్యోగం లేదు, ఇల్లు నిజంగా గడవట్లేదు అన్నట్టు చూపించి ఉంటే బాగుండేది. ఆమెకు సంగీతం మీద అసహ్యం చూపించాలి కాబట్టి చూపించాడు - లాజిక్ లేదు.
అలాగే ఒక్క సినిమాని ఒక్కే genre లో తీయాలి. లేకపోతే కలగాపులగం అయిపోతుంది. ఇక్కడ జరిగింది అదే. పైన చెప్పిన మూడు సినిమాలలో పాత్రల మధ్య బంధాలు మారాయి తప్ప ఎక్కడ ప్రేమని ఇరికించే ప్రయత్నం జరగదు. అందుకని అవి ఘనవిజయాలు సాధించాయి. ఏమంటారు?
Mail your comments to : potluri040.funden@gmail.com
No comments:
Post a Comment